ICC చైర్మన్‌గా గ్రెగ్‌ బార్‌క్లే

ICC చైర్మన్‌గా గ్రెగ్‌ బార్‌క్లే : ఖవాజాకు 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం మూడింట రెండొంతుల

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌కు కొత్త బాస్‌ వచ్చాడు. ఐసీసీ ఛైర్మన్‌గా న్యూజీల్యాండ్‌ క్రికెట్‌ డైరెక్టర్ గ్రెగ్ బార్ క్లే ఎన్నికయ్యారు. తాత్కాలిక చైర్మన్‌గా ఉన్న ఇమ్రాన్ ఖవాజా స్థానంలో బార్‌క్లే బాధ్యతలు చేపడతారు. ఇంతకుముందున్న అధ్యక్షుడు శశాంక్‌ మనోహర్‌ తర్వాత.. ఆ స్థానంలో బార్‌ క్లే పగ్గాలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఐసీసీ బోర్డులో న్యూజీల్యాండ్‌ క్రికెట్ ప్రతినిధిగా ఉన్న బార్‌ క్లే.. అధ్యక్షుడిగా ఎన్నికవడంతో తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.

శశాంక్‌ మనోహర్‌ పదవీకాలం గత జులైతో ముగియడంతో.. ఇమ్రాన్‌ ఖవాజా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. అయితే ఛైర్మన్ పదవికోసం తాత్కాలిక అధ్యక్షుడితో.. బార్‌ క్లే పోటీ పడ్డారు. గ్రెగ్‌ బార్ క్లే కు 11 ఓట్లు రాగా.. ఖవాజాకు 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం మూడింట రెండొంతుల మెజార్టీ సాధించడంతో.. బార్ క్లే ఐసీసీ ఛైర్మన్‌ పదవికి ఎన్నికయ్యాడు.

గ్రెగ్ బార్‌ క్లే.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు చెందిన చాలా కంపెనీల్లో

కమర్షియల్‌ లాయర్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన గ్రెగ్ బార్‌ క్లే.. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు చెందిన చాలా కంపెనీల్లో డైరెక్టర్ హోదాలో పని చేశారు. అంతేకాకుండా.. 2015 పురుషుల వరల్డ్ కప్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. క్రికెట్ అభివృద్ధి కోసం తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా బార్ క్లే తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు