ప్లేయర్‌ ఆఫ్ ద డికెడ్.. జాబితాలో కోహ్లీ అశ్విన్ మిథాలి..

ప్లేయర్‌ ఆఫ్ ద డికెడ్.. జాబితాలో కోహ్లీ అశ్విన్ మిథాలి.. : సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌, ఇంగ్లండ్‌ నుంచి జో రూట్, న్యూజిల్యాండ్‌ జట్టులోని కేన్ విలియమ్సన్, శ్రీలంక టీమ్‌.

టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ.. మరో అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐసీసీ నిర్వహిస్తున్న ప్లేయర్ ఆఫ్ ది డికెడ్‌ జాబితాలో కోహ్లీకి చోటు దక్కింది. కోహ్లీతో పాటు.. స్పిన్నర్‌ రవిచంద్రన్ అశ్విన్‌ కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్నాడు.

ఈ దశాబ్ధపు అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాను రూపొందిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి.. పలువురిని నామినేట్ చేసింది. అందులో మన కోహ్లీతో పాటు.. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌, ఇంగ్లండ్‌ నుంచి జో రూట్, న్యూజిల్యాండ్‌ జట్టులోని కేన్ విలియమ్సన్, శ్రీలంక టీమ్‌ నుంచి కుమార సంగక్కర, ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ కూడా పోటీ పడుతున్నారు.

ప్లేయర్‌ ఆఫ్ ద డికెడ్.. జాబితాలో కోహ్లీ అశ్విన్ మిథాలి

అంతేకాకుండా.. కోహ్లీ మొత్తం నాలుగు కేటగిరీల్లో స్థానం సంపాదించాడు. డికెడ్ ఆఫ్‌ ది ప్లేయర్‌తో పాటు.. వన్డే ప్లేయర్ ఆఫ్‌ ది డికెడ్ జాబితాలోనూ స్థానం సంపాదించాడు. ఈ జాబితాలో కోహ్లీతో పాటు.. ధోనీ, రోహిత్ శర్మ కూడా ఉన్నారు. అలాగే శ్రీలంక నుంచి లసిత్ మలింగ, కుమార సంగక్కర కూడా ఉండగా.. ఆస్ట్రేలియా నుంచి మిచెల్ స్టార్క్ ఉన్నారు.

ఇక ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది డికేడ్ జాబితాలో మాజీ కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ స్థానం దక్కించుకున్నారు. అలాగే ఆసీస్ కు చెందిన ఎల్లీస్ పెర్రీ, మెగ్ లన్నింగ్, న్యూజీల్యాండ్‌ నుంచి సుజి బేట్స్, వెస్టిండీస్‌ ప్లేయర్‌ స్టఫనీ టేలర్, ఇంగ్లండ్‌ ప్లేయర్‌ సారా టేలర్ నామినేట్ అయ్యారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు