సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఈ కేసులో ఏ1 గా సాయికృష్ణారెడ్డి, ఏ2 గా అశోక్ రెడ్డి, ఏ 3 గా దేవరాజ్ రెడ్డిలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు పెళ్లి పేరుతో శ్రావణిని నమ్మించి వంచించారని పోలీసులు పేర్కొన్నారు. మోసం చేశారనే బాధ భరించలేక శ్రావణి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు.
ఏ2 నిందితుడిగా పేర్కొంటున్న అశోక్‌రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తామన్నారు. ఈ కేసులో శ్రావణి తల్లిదండ్రులను నిందితులుగా చేర్చడానికి కుదరదని డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాగా సోమవారం విచారణకు హాజరుకావాలని అశోక్ రెడ్డికి పోలీసులు నోటీసులు పంపారు..
మీ అభిప్రాయం కామెంట్ చేయండి