రకుల్, మంచు లక్ష్మి పై తీవ్ర విమర్శలు చేసిన శ్రీరెడ్డి

శ్రీరెడ్డి తెలుగు ప్రజలకు సుపరిచుతురాలు.. ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటారు. ఇండస్ట్రీలో టాప్ హీరోలు, నిర్మాతలపై ఈమె గతంలో చేసిన ఆరోపణలు సంచలం సృష్టించాయి. ఇక తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, నటి మంచు లక్ష్మిపై విమర్శల వర్షం కురింపించింది. ఇది ప్రతీకారం కాదు అప్పుడు నేను ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటే రకుల్ అలాంటివి ఇండస్ట్రీ లో ఏమి లేవని, డ్రగ్స్ లాంటివి లేవని, ఇక్కడ ఎవరు ఎవరినీ తిట్టరు అంటూ పెద్ద క్యాండిల్ ర్యాలీ చేసిందిగా అంటూ కాస్త వెటకారంగా రకుల్ ‌ను టార్గెట్ చేసింది. అంతేకాదు మంచు లక్ష్మి ఏమో.. మా ఇండస్ట్రీలో డ్రగ్స్ ఉన్నాయా ? కాస్టింగ్ కౌచ్ ఉందా ? అందాల మేడలో ఉన్న మమ్మల్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటూ అప్పుడు మంచు లక్ష్మీ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా శ్రీ రెడ్డి గుర్తు చేసింది. మరి ఈరోజున డ్రగ్స్ విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు బయటకు వచ్చింది.

ఆరోజున టాలీవుడ్ ఇండస్ట్రీ లో డ్రగ్స్ లేవు,కాస్టింగ్ కౌచ్ లేదు అని మాట్లాడిన రకుల్ ఈరోజున బాలీవుడ్‌లో మాత్రం అక్కడ కాస్టింగ్ కౌచ్ ఉండకూడదంటూ చెప్పడం రెండు నాల్కల ధోరణి కాదా అని ప్రశ్నించింది. ఇక డ్రగ్స్ విషయంలో రకుల్ పేరు ఎలా వచ్చిందో తెలియదు. ఆరోజు నా పైన తప్పుడు వాగుడు వాగిన రకుల్ ఇప్పుడు ఆమె గుట్టు మొత్తం రట్టు అవుతుంది, త్వరలోనే ఇంకా అన్ని బయటపడతాయంటూ శ్రీ రెడ్డి తమదైన శైలిలో విమర్శలు చేసింది. అంతేకాదండోయ్ నాకు వచ్చిన చెడ్డ పేరు ఎలాగో వచ్చింది, ఎవరు చేసిన కర్మవారు అనుభవించక తప్పదు అంటూ వేదాంతాలు మాట్లాడింది. మొత్తానికి రకుల్ అలాగే మంచు లక్ష్మి ను టార్గెట్ చేసేంది శ్రీరెడ్డి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి