చదువు కోసం వచ్చి కరోనా బారినపడ్డారు.

చదువుకుందుకు వచ్చి కరోనా బారినపడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలు ప్రారంభించిన విషయం తెలిసిందే.. ఒకటి నుంచి 8 తరగతి వరకు విద్యార్థులు ఇంటి నుంచి పాటలు వినాలి. ఇక 9, 10 తరగతుల విద్యార్థులు పాఠశాలకు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది.. ఈ నేపథ్యంలోనే వారు పాఠశాలలు వచ్చి తరగతులు వింటున్నారు. అయితే ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం మారెళ్ల జిల్లా పరిషత్ హైస్కూల్ లో 9, 10వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు.

కాగా ఈ విషయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు తాము విద్యార్థులకు పరీక్షలు చేయించామని తెలిపారు.. పరీక్షల్లో పదిమంది విద్యార్థులకు పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. కరోనా సోకినట్లుగా డా.. వనజారెడ్డి ఫోన్ ద్వారా తెలిపారని ప్రధానోపాధ్యాయుడు అన్నారు. కాగా కరోనా పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ సెంటర్ కు తరలించినట్లు తెలిపారు. వీరిలో సుంకరవారిపాలెంలో 6గురు విద్యార్థులకు,మారేళ్ళలో ఇద్దరికి, గంగన్నపాలెంలో ఇద్దరికి కరోనా లక్షణాలున్నట్లు తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి