కన్నీరు పెట్టిన సుమ..

కన్నీరు పెట్టిన సుమ..

సుమ తెలుగు తెరపై టాప్ యాంకర్.. యాంకర్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ సుమ మాత్రం ఎక్కడికి పోరు ఇక్కడే ఉంటారు.. కాగా ఈమె చేసే షోలలో నవ్వులే ఎక్కువగా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఏడుపులు కూడా ఉంటాయి.

ప్రోగ్రాం కి వచ్చిన వారు తమ బాధలు చెప్తుంటారు.. వారి బాధలు విని చాలామంది కంటతడి పెడతారు. ఇక తాజగా జరిగిన క్యాష్ ప్రోగ్రాం షూటింగ్ కు బుల్లితెర నటుడు కార్తీక్ వచ్చాడు. ఈ సందర్బంగా ఆయన తన ఫ్యామిలీకి సంబందించిన కొన్ని విషయాలు తెలిపారు.

తన తల్లికి క్యాన్సర్ అని ఇప్పటికి 30 సార్లు కీమో చేయించుకున్నారని, ఆమె ఓ యోధురాలని తెలిపాడు కార్తీక్ రెండు మేజర్‌ సర్జరీలు కూడా జరిగాయని అన్నారు. కార్తీక్ తన తల్లి బాధలు చెబుతుండగా సుమ కన్నీరు పెట్టారు. ఇక కార్తీక్ మాట్లాడుతూ ఎంతోమందికి జబర్దస్త్ జీవితం ఇచ్చిందని తెలిపారు.

కారు, ఇల్లు కొనుక్కునే స్థాయికి ఎదిగాము అంటే జబర్దస్త్ వల్లనే అని తెలిపాడు. చాలామంది ఆర్టిస్టులు జబర్దస్త్ వలన మూడు పూటలా అన్నం తింటున్నరని తెలిపాడు కార్తీక్. ఈ మాటలు విని సెట్ లోని వారు చాలామంది కన్నీరు పెట్టారు.

 

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు