ఎస్వీబీసీకి కొత్త చైర్మన్ వచ్చారు.

ఎస్వీబీసీకి కొత్త చైర్మన్ వచ్చారు.

సినీ నటుడు పృద్వి రాజీనామా చేసిన నాటి నుంచి ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. కాగా ఈ పదవిలో మాజీ ఎమ్మెల్యే వీబీ సాయి కృష్ణ యాచేంద్రను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన యాచేంద్ర గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ శనివారం పదవి బాధ్యతలు స్వీకరించే అవకాశం కనిపిస్తుంది.

ఈ పదవికోసం చాలామంది పోటీపడ్డారు. చాలామంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఓ ఛానల్ లో ప్రముఖ యాంకర్ ని ఎస్వీబీసీ చైర్పర్సన్ ను చేస్తారని వార్తలు వచ్చాయి. కానీ చివరకు యాచేంద్రను ప్రభుత్వం ఎంపిక చేసింది. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన యాచేంద్ర ఎన్టీఆర్ సమయంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 వరకు ఆయన టీడీపీలోనే కాగా తాజాగా వైసీపీకి దగ్గరయ్యారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు