ఎట్టకేలకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో అంటే.. 2021లో పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీ అన్ని విషయాలు ప్రకటిస్తానని.. అప్పటి వరకు వెయిట్ చేయాలని అభిమానులను కోరారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. జనవరి నుంచి పార్టీ కార్యక్రమాలు ఉంటాయని కూడా తెలిపారు.
2021 మార్చి – ఏప్రిల్ నెలల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇంకా నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో పార్టీ ప్రకటించిన వెంటనే ప్రచారంలోకి దిగనున్నారు రజనీకాంత్. తలైవా ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఇక నుంచి ఆయన్ను రాజకీయ ప్రత్యర్థిగానే చూడనున్నారు ప్రతిపక్షాలు.
కొత్త ఏడాదిలో రజనీకాంత్ అభిమానులకు గిఫ్ట్ ఇచ్చాడని.. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. జయలలిత, కరుణానిధి లేకుండా మొదటిసారి జరుగుతున్న ఎన్నికలు ఇవే. అన్నాడీఎంకే పదేళ్లుగా అధికారంలో ఉంది.. ఈసారి విజయం ఖాయం అని డీఎంకే పార్టీ భావిస్తున్న తరుణంలో.. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ డీఎంకే పార్టీకి నష్టం అని భావిస్తున్నారు.
రాజనీకాంత్ రాజకీయ పార్టీ పేరు, గుర్తు ఏంటీ అనే ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 31వ తేదీ ఎజెండా ప్రకటించనున్న క్రమంలో రకరకాలు ఊహాగానాలు ప్రచారం జరుగుతున్నాయి.