తమిళనాడుకు పొంచివున్న ముప్పు

తమిళనాడుకు పొంచివున్న ముప్పు

ఈశాన్య రుతుపవనాలు బుధవారం తమిళనాడులోకి ప్రవేశించాయి. దింతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో నైరుతి ప్రభావం ఈ ఏడాది తక్కువగానే ఉంది. ఈశాన్య ఋతుపవలన ప్రభావం అధికంగా ఉండనున్నట్లు తెలుస్తుంది. ఇక కర్ణాటకలో కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి.

ఇక ఈశాన్య రుతుపవనాల రూపంలో రాష్ట్రంలో వర్షాలు ఆశాజనకంగానే ఉంటాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారింది. సముద్ర తీర జిల్లాల్లో వర్షం పడడం, వాతావరణం పూర్తిగా మారింది. అండమాన్‌కు సమీపంలో బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడడం, ఈశాన్య రుతుపవనాల రాక వెరసి రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడనున్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఇక ఇప్పటికే ప్రాజెక్టులు నిండి ఉండటంతో వచ్చిన కురిసిన వర్షపు నీరు చాలా వరకు వృధా అయ్యే అవకాశం కనిపిస్తుంది. వర్షాల తీవ్రత అధికంగా ఉంటే లోతట్టు ప్రాంతాలు జలమయం కాక తప్పదు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి