టీడీపీ ధర్మపోరాటం – అన్ని ఆలయాల్లో వారం రోజులు పూజలు

అంతా బాగానే ఉంది.. ప్రసాదం, అన్నదానాలు కూడా చేస్తే బాగుంటుంది అంటున్నారు హిందూ భక్తులు.. పుణ్యం

అంతర్వేది ఘటనను అనుకూలంగా మార్చుకోవటం కోసం.. బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్త ప్లాన్ వేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. హిందూవులతో టీడీపీ కార్యక్రమాన్ని రూపొందించారు. వారం రోజులు చేపట్టనున్నారు.

2020, సెప్టెంబర్ 13 నుంచి 20వ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు హోమాలు, యాగాలు చేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ 13వ తేదీన సూర్య దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. సోమవారం శివాలయాల్లో, మంగళవారం ఆంజనేయస్వామి ఆలయాల్లో, బుధవారం అయ్యప్పస్వామి, వినాయకుడి ఆలయాల్లో, గురువారం సాయిబాబా ఆలయాల్లో పూజలు చేయిస్తున్నారు. శుక్రవారం దుర్గమ్మ ఆలయాల్లో, శనివారం వేంకటేశ్వస్వామి గుడుల్లో ఈ పూజాలు, పునస్కారాలు చేయాలని నేతలు, కార్యకర్తలను కోరారు.

అంతర్వేది ఘటనను రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవటానికి, సీఎం జగన్ వ్యక్తిగత మతాన్ని హైలైట్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. హిందూవులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని.. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తుంది అని చెప్పటానికి ఈ ప్రణాళిక రచించారు చంద్రబాబు.

అంతా బాగానే ఉంది.. ప్రసాదం, అన్నదానాలు కూడా చేస్తే బాగుంటుంది అంటున్నారు హిందూ భక్తులు.. పుణ్యం కూడా వస్తుంది కదా..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి