కొత్త జెర్సీలో కనిపించనున్న టీం ఇండియా క్రికెటర్లు
మొన్నటివరకు ఐపీఎల్ ఉండటంతో తెగ ఎంజాయ్ చేశారు క్రికెట్ అభిమానులు. ఇక ఇప్పుడు అభిమానుల దృష్టి ఆస్ట్రేలియా టూర్ పై పడింది. ఇప్పటికే భారత జట్టు ప్రకటన అయింది. వచ్చేవారం ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లనున్నారు ఆటగాళ్లు.
ఇక ఈ నేపథ్యంలోనే భారత ఆటగాళ్లు కొత్త జెర్సీలో కనువిందు చెయ్యనున్నారు. డార్క్ బ్లూ కలర్ యూనిఫాంలో కనిపించునుంది. 90వ దశకంలో భారత ఆటగాళ్లు ఇలాంటి ముదురు రంగు జెర్సీలనే ధరించేవారు. తాజాగా బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంపీఎల్ స్పోర్ట్స్ సంస్థ అలనాటి డిజైన్ తో భారత జాతీయ జట్టు క్రికెటర్ల కోసం కొత్త జెర్సీలు రూపొందించింది.
ఇక ఆస్ట్రేలియా టూర్ లో ఈ కొత్త జెర్సీలో కనిపించనున్నారు భారత ఆటగాళ్లు.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి