అందుబాటు ధరలో నోకియా సీ1 ప్లస్ 4జీ మొబైల్

సామాన్యులకు అందుబాటులో నోకియా సీ1 ప్లస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను యూరోపియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పని చేస్తుంది.

అందుబాటు ధరలో నోకియా సీ1 ప్లస్ 4జీ మొబైల్

స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్. 4జీ కనెక్టివిటీ తో తక్కువ ధరకే టచ్ ఫోన్స్. మొబైల్ కంపెనీలలో అత్యంత పేరు సంపాదించుకున్న వాటిలో నోకియా ఒక్కటి. ఇపుడు సామాన్యులకు అందుబాటులో నోకియా సీ1 ప్లస్ ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ను యూరోపియన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ మొబైల్ ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా పని చేస్తుంది.

నోకియా సీ 1 ప్లస్ మొబైల్ ధర కేవలం 6,200 మాత్రమే, అందులోనూ 4జీ కనెక్టివిటీ తో లభించడం విశేషం. ఎరుపు, నీలం రంగులలో ఇది భారత మార్కెట్లో లభించనుంది. ఇక నోకియా సీ 1ప్లస్ ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే 5.45-అంగుళాల హెచ్‌డి స్క్రీన్, 18:9 డిస్ప్లే రేషియోతో కలిగి ఉంది.

మరిన్ని ఫీచర్స్ ఏంటంటే 1.4గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ప్రాసెసర్ ఉండగా..1జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 128జీబీ స్టోరేజీ వరకు పెంచుకోవచ్చు, అలాగే సెల్ఫీ, వీడియోల కోసం ముందు, వెనుక భాగంలో 5మెగాపిక్సల్ ఒకే కెమెరా లభిస్తుంది.

దీని బ్యాటరీతో సపోర్ట్ 2500 ఎంఏహెచ్ కలిగి ఉండటంతో పాటు వైఫై, బ్లూటూత్ 4.2, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్/ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ వంటి స్పెషలిటీలు ఉన్నాయి. 5వాట్ చార్జింగ్‌కి సపోర్ట్ కలిగి ఉండటం అనేది సీ1 ప్లస్ మరో ప్రత్యేకత అని చెప్పొచ్చు. యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలెరోమీటర్ (జి-సెన్సార్)ను కూడా కలిగి ఉంటుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు