అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకి నోకియా 5.4

హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ వారు నోకియా 5.4 మొబైల్ ను త్వరలో మార్కెట్లోకి లాంచ్ చేస్తునట్టు న్యూస్ వస్తున్నాయి. ఇది నోకియా 5.3 వెర్షన్ కి తర్వాతి మోడల్ కాగా, ఆండ్రాయిడ్ వీ10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది

అదిరిపోయే ఫీచర్స్ తో మార్కెట్లోకి నోకియా 5.4

పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు మార్కెట్లోకి ఎప్పటికి అప్పుడు కొత్త మోడల్, కొత్త డిజైన్ లతో మొబైల్స్ ను విడుదల చేస్తుంటారు. ప్రత్యేకంగా పండగ సీజన్లో అయితే మరి ఎక్కువ అనుకోండి పోటీ మీద పోటీ తో వినియోగదారుల అభిరుచులను తెలుసుకుంటూ రిలీజ్ చేస్తారు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు మనం ఎంతలా మొబైల్స్ కి అట్ట్రాక్ట్ అయ్యామో.

తాజాగా ఇపుడు హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ వారు నోకియా 5.4 మొబైల్ ను త్వరలో మార్కెట్లోకి లాంచ్ చేస్తునట్టు న్యూస్ వస్తున్నాయి. ఇది నోకియా 5.3 వెర్షన్ కి తర్వాతి మోడల్ కాగా, ఆండ్రాయిడ్ వీ10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్‌తో స్మార్ట్ ఫోన్ పని చేస్తుంది.

నోకియా 5.4 మొబైల్ విషయానికి వస్తే 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీలో లభ్యమవుతుంది. డిసెంబర్ చివరి వారంలో ఈ స్మార్ట్ ఫోన్స్ మనల్ని అల్లరించబోతున్నాయి అది కూడా బ్లూ, పర్పుల్ రంగుల్లో వస్తుందని సమాచారం.

మరిన్ని ఫీచర్ల గురించి తెలియాలంటే, దీనికి  6.4 అంగుళాల హోల్ పంచ్ డిస్ ప్లేను.. నోకియా 5.4లో తన క్రితం వెర్షన్ మొబైల్ నోకియా 5.3 మాదిరిగానే 13 ఎంపీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా, 5 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్, 2 ఎంపీ మాక్రో కెమెరా ఉండబోతుంది. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సల్ కెమెరా తీసుకురావడంతో సెల్ఫీ ప్రియులను మరింత ఆకర్షించబోతుంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా.. ఇది గూగుల్ ఎఆర్ కి కూడా సపోర్ట్ ఇవ్వడం అనేది ఫోన్ యొక్క మరో స్పెషలిటీ అని చెప్పాలి.

ఇప్పటికే నోకియా 5.4 మొబైల్స్ పలు ఆస్ట్రేలియా వెబ్ సైట్ లలో హల్ చల్ చేస్తుంది. దీని మోడల్ ఆకట్టుకునేలా రూపుదిద్దారని తెలుస్తుంది. ఈ వెబ్ సైట్లు ప్రకారం దీని ధర వచ్చేసి 350 ఆస్ట్రేలియన్ డాలర్లుగా అంటే దాదాపు 19,000 రూపాయలు ఉంటుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు