ఆండ్రాయిడ్ యాప్స్ లో బగ్ – తొందరగా డిలీట్ చేయండి

కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ లో బగ్ ఉన్నట్లు చెక్‌పాయింట్ పరిశోధకులు చెప్పుకొచ్చారు..ఈ బగ్ బయటపడడానికి కారణం డెవలపర్ నిర్లక్ష్యం.. గూగుల్ దీనిని 2020 ఏప్రిల్ లో బగ్ ని కనిపెట్టి పరిష్కరించింది.

ఆండ్రాయిడ్ యాప్స్

స్మార్ట్ ఫోన్ లో ఎన్నో అప్లికేషన్స్ ఉంటాయి.. అన్ని రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం. కొత్తగా ఏదైనా అప్లికేషన్ రిలీజ్ అయ్యి పాప్యులర్ అయితే వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసేసుకుంటాం. కాని మనం సెక్యూరిటీ గురించి ఆలోచించాలి, లేకపోతే మన ఫోన్ ప్రమాదంలో ఉన్నట్టు.

తాజాగా కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్ లో బగ్ ఉన్నట్లు చెక్‌పాయింట్ పరిశోధకులు చెప్పుకొచ్చారు. ఆ యాప్స్ ఏంటంటే ఓక్‌కుపిడ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ప్రముఖ డేటింగ్‌ యాప్ వైబర్, ట్రావెల్, గ్రైండర్, బంబుల్, వీడియో కాలింగ్ యాప్స్ తో పాటు గూగుల్ కోర్ లైబ్రరీ కి సంబంధించిన రెండు యాప్స్ మాత్రమే కాకుండా ఇతర యాప్స్ లలో సమస్య ఉన్నట్లు తెలిపారు.

ఈ బగ్ బయటపడడానికి కారణం డెవలపర్ నిర్లక్ష్యం.. గూగుల్ దీనిని 2020 ఏప్రిల్ లో బగ్ ని కనిపెట్టి పరిష్కరించింది. CVE-2020-8913 అనే పేరు తో బగ్ కి నామకరణం చేసారు. దీని వలన కలిగే నష్టాలు గురించి మాట్లాడితే, సైబర్ క్రీమినల్స్ మీ మొబైల్ యొక్క డెవలపింగ్ కోడ్ అనేది సులువుగా పొందుతారు. అప్పుడు మొబైల్ సెక్యూరిటీ కోడ్ ని మార్చి హానికరమైన కోడ్ ను ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు తెలియకుండా సోషల్ మీడియా అకౌంట్ డీటెయిల్స్, బ్యాంకు వివరాలు, మరెన్నో ముఖ్యమైన వివరాలు హ్యాకర్స్ తెలుసుకుంటారు.

గూగుల్ ప్లే కోర్ లైబ్రరీ (జీపీసీ)నే చాలా మంది వాడుతున్నారు.. డెవలపర్లు తమ అప్‌డేట్స్‌ను దీని సహాయంతోనే యూజర్లు కు పంపుతారు. గూగుల్ ప్లే స్టోర్‌లోని కొన్ని యాప్స్ ను 2020 సెప్టెంబర్ నెలలో చెక్ పాయింట్ పరీక్ష జరపడంతో, బగ్ ఉందని గుర్తించడం సాధ్యమయింది. పూర్తిగా అయితే గూగుల్ ఈ సమస్యను పరీక్షించలేదు అని నిపుణులు పేర్కొన్నారు. అందుకుని త్వరగా యాప్స్ ని డిలీట్ చేయడం మంచిది అని తెలిపారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు