ఆగనున్న మైక్రోసాఫ్ట్ టీమ్స్ సర్వీసెస్?

ఈ సంవత్సరము మొదటిలోనే మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది

మైక్రోసాఫ్ట్

మనం తరుచు ఇంటర్నెట్  వెబ్ ని వాడుతూ ఉంటాం, వాటిలో మైక్రోసాఫ్ట్ టీమ్స్ అప్లికేషన్ ఒక్కటి. ఎక్కువ పాపులర్ అయిన మైక్రోసాఫ్ట్ టీమ్స్ ప్రస్తుతం నిలిచిపోనున్నది. అందుతున్న సమాచారం ప్రకారం, ఇవాల్టి నుండి తమ సర్వీసెస్ నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ఇన్ కేస్, మీరు గనుక మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ ని కావాలనుకుంటే.. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ని యూజ్ చేసుకోవచ్చు అని తెలిపింది. ఈ సంవత్సరము మొదటిలోనే మైక్రోసాఫ్ట్ టీమ్స్ సేవలు ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే,  మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజర్స్ తన మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ను వడాలనేది ప్రధాన కారణం. మరో పక్క మైక్రోసాఫ్ట్ మరిన్ని వివరాలు తెలపగా.. వన్ డ్రైవ్, ఆఫీస్ 365, ఔట్‌లుక్‌ వంటి సర్వీసులు 2021, ఆగస్టు 17 నుంచి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్11కు సహాయం చేయవని పేర్కొంది.

ఎడ్జ్‌ లెగస్సీ డెస్క్‌ టాప్‌ యాప్, మార్చి 9, 2021 తరువాత నుండి ఎటువంటి కొత్త అప్డేట్స్ ను పొందలేదు అని చెప్పగా, కొత్త మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్‌ కొత్త విండోస్ ఫీచర్ అప్ డేట్స్ తో దీనికి ప్రత్యామ్నాయం అని తెలిపింది. మైక్రో సాఫ్ట్ కొత్తగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ను ఇంట్రడ్యూస్ చేయగా, సేమ్ క్రోమ్ బ్రౌసర్ లాగానే మరి కొంత వేగంతో పనిచేస్తుంది అని వివరించింది.

1995, ఆగష్టులో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్  విదుదల అయ్యింది అంటే దాదాపు 25 ఇయర్స్ అవ్వగా, 2003లో  ఎక్కువ ఉపయోగించిన బ్రౌజర్లు లో.. 95% వాటా తో ఫస్ట్ ప్లేస్ లో ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ స్థానం సంపాదించుకుంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ ను తీసుకురావటానికి మెయిన్ గ రీసన్ ఏంటంటే గూగుల్ క్రోమ్,  ఫైర్‌ఫాక్స్ వంటి బ్రౌజర్లకు పోటీ ఇవ్వనుంది అని తెలుస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు