ఇక పై కలిసి సేవలు అందించనున్న జియో,రియల్ మీ

ఇండియాలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కొంతమంది 2జీ నెట్ నెట్ వర్క్ మొబైల్స్ ఉపయోగిస్తున్నారని.. వారి కోసం అతి తక్కువ ధరకి 4జీ మొబైల్స్ ని తీసుకొస్తున్నామని, ఈ 4జీ మొబైల్స్ కోసం, రియల్ మీ, ఇతర సంస్థలతో కలిసి మొబైల్స్ తో పాటు.. వాటి తయారీకి కావలసిన పరికరాలను కూడా త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు దత్ వివరించారు.

ఇక పై కలిసి సేవలు అందించనున్న జియో , రియల్ మీ

రీసెంట్ గా, కొన్ని టెలికాం సంస్థలు, స్మార్ట్ ఫోన్ తయాదరిల కంపెనీలతో కలిసి వినియోగదారులకు వారి సేవలను అందిస్తున్నారు. ఇదే జోరు తో ఇప్పుడు ప్రముఖ టెలికాం కంపెనీ జియో రియల్ మీ తో కలవనున్నట్లు ప్రకటించింది. వీళ్ల కలయికతో 4జీ, ఇతర గాడ్జెట్స్ తయారు చేస్తున్నట్లు ఆ సంస్థ సీనియర్ అధికారి పేర్కొన్నారు. సామాన్యులకు అందుబాటు ధరలో 4జీ ఫోన్లను తీసుకురావడంతో పాటు ఫీచర్ లో రాబోతున్న 5జీ నెట్ వర్క్ కు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ లు రూపుదిద్దుకోబోతున్నాయని తెలిపారు.

రిలయన్స్ జియో అధ్యక్షుడు సునీల్ దత్ మాట్లాడుతూ, ఇండియాలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికి కొంతమంది 2జీ నెట్ నెట్ వర్క్ మొబైల్స్ ఉపయోగిస్తున్నారని.. వారి కోసం అతి తక్కువ ధరకి 4జీ మొబైల్స్ ని తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ 4జీ మొబైల్స్ కోసం, రియల్ మీ, ఇతర సంస్థలతో కలిసి మొబైల్స్ తో పాటు.. వాటి తయారీకి కావలసిన పరికరాలను కూడా త్వరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు దత్ వివరించారు.

త్వరలో, దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్లను తీసుకువస్తున్నట్లు, అది కూడా సామాన్యులకు అందుబాటు ధరలో లభిస్తుందని రియల్‌ మీ సీఈఓ మాధవ్‌ శేత్‌ తెలిపారు. ఒక్కేసారి ఎక్కువ మొబైల్స్ తయారీకి ఎక్కువ చిప్ సెట్లు అవసరమవుతాయని, అవే ప్రధాన పాత్ర పోషిస్తాయని మాధవ్‌ శేత్‌ అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా కంపెనీ డిజిటల్ టెక్నాలజీ కోసం ఎంతో కష్టపడింది అని మీడియాటెక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అంకు జైన్ తెలియచేసారు.

5జీ సహాయంతో క‌ృతిమ మేధ, రోబోలు, డ్రోన్లు, ఆటోమెటిక్ వాహనాలు వంటి సాంకేతిక విప్లవం, రానున్న రోజుల్లో వస్తాయని.. 2021లో ఇండియాలో 5జీ సేవలు అంధుబోతున్నాయని అందుకు తగట్టుగా స్మార్ట్ ఫోన్ తయారీకి పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కలయిక వినియోగదారులను ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూద్దాం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు