ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ -12 వేలకే

బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ భారతదేశంలో తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. హెచ్‌డీ డిస్ ప్లేను కలిగి ఉన్న 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 11,999/- ఉండగా, 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ .19,999/- కి లభిస్తుంది.

ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 12 వేలకే

ఎంత టెక్నాలజీ పెరిగిన, టీవీ కి ఉన్న ప్రత్యేకత వేరు. మార్నింగ్ నుండి ఎన్నో వర్క్స్ చూసుకుని సాయంత్రం రిలాక్సేషన్ కోసం టీవీ లో వచ్చే ఎన్నో ప్రోగ్రాంలు, సినిమాలు చూస్తాం. ఇపుడు ప్రపంచమంతా స్మార్ట్ టెక్నాలజీ తో నడుస్తుంది, టీవీలు కూడా స్మార్ట్ అయ్యాయి.. అయ్యినప్పటికీ టీవీపై మోజు పెరిగింది.

కస్టమర్ల అభిరుచి తగట్టు బడ్జెట్, ఎంట్రీ లెవల్ స్మార్ట్ టీవీలు వస్తున్నాయి, లేటెస్ట్ గా బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చిన ఇన్ఫినిక్స్ భారతదేశంలో తన మొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ టీవీ 32 అంగుళాల, 43-అంగుళాల వేరియంట్‌లతో ఎక్స్ 1 స్మార్ట్ టివి సిరీస్ తో మార్కెట్లోకి అడుగు పెట్టింది. ఈ స్మార్ట్ టీవీలను కెన్యా మరియు ఇతర దేశాలలో ప్రారంభించారు. టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ పొందటంతో, ఇందులో చూడటంలో ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

ఇన్ఫినిక్స్ ఎక్స్ 1 స్మార్ట్ టివిని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఆవిష్కరించింది. హెచ్‌డీ డిస్ ప్లేను కలిగి ఉన్న 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర 11,999/- ఉండగా, 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ .19,999/- కి లభిస్తుంది. ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీకి ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లేను అందించారు, అది కూడా అంచులు లేని డిస్ప్లేని అందించారు. బెస్ట్ సౌండ్ క్వాలిటీ కోసం అంతర్నిర్మిత బాక్స్ స్పీకర్లు లభిస్తుంది. 43 అంగుళాల స్మార్ట్ టీవీ 24వాట్ స్పీకర్‌ను, 32 అంగుళాలకి 20వాట్ స్పీకర్‌ను తీసుకువచ్చారు.

స్మార్ట్ టీవీ లో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి, ముఖ్యంగా 1జీబీ ర్యామ్ , 8జీబీ రోమ్ వంటి శక్తివంతమైన మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్‌ ద్వారా ఇది పని చేస్తుంది. మరింత వీడియో కనెక్టివిటీ కోసం క్రోమ్ కాస్ట్ తీసుకురావడంతో..నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ మొదలైన వీడియో యాప్స్ సులభంగా వీక్షించచ్చు.

60 హెర్ట్జ్ డిస్ ప్లే ఫీచర్లు కలిగి, ఎపిక్ 2.0 పిక్చర్ ఇంజిన్ ఉండటం మరో స్పెషలిటీ అనే చెప్పాలి. 32 అంగుళాల టీవిలో ఒక యూఎస్‌బీ పోర్టు, రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు, బ్లూటూత్ 5.0, ఐఆర్ రిమోట్, వైఫై వంటివి లభిస్తున్నాయి. 43 అంగుళాల టీవిలో బ్లూటూత్ 5.0, బ్లూటూత్ రిమోట్, రెండు యూఎస్‌బీ పోర్టు, వైఫై, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు వంటివి అందించారు. ఒక స్మార్ట్ టీవీకి కావాల్సిన అన్ని ఫీచర్లు ఉన్నాయి కాబట్టి సామాన్యులకు మరింత చేర్యవయ్యే అవకాశం ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు