ఇన్‌స్టాగ్రాం అదిరిపోయే కొత్త ఫీచర్

ఇన్‌స్టాగ్రాం వినియోగదారులకు శుభవార్త : ఒకేసారి నలుగురితో లైవ్

ఇన్స్టాగ్రాం
మన స్మార్ట్ ఫోన్స్ లో ఎక్కువగ యూజ్ చేసేవి సోషల్ మీడియా అప్లికేషన్స్, అందులో ఇన్‌స్టాగ్రాం ఒకటి ఎక్కువ వాడుతాం. ఎంత పనిలో ఉన్న ఇన్‌స్టాగ్రాం ఓపెన్ చేసి కాసేపు స్క్రోల్ చేసి, స్టోరీస్ చూస్తే ఎంతో రిలాక్సేషన్ వస్తది.
దీని గుర్తుపెట్టుకుని, వినియోగదారులకు ఒక కొత్త ఫీచర్ ని ఆడ్ చేస్తునట్టు మంచి శుభవార్త చెప్పింది. ఇప్పుడు కొత్తగా ఇన్‌స్టాగ్రాం లైవ్ రూమ్స్ ద్వారా ఒక్కేసారి 4 మెంబెర్స్ తో లైవ్ వీడియో చాట్ చేయొచ్చు అని తెలిపింది.
అసలు ఇన్‌స్టాగ్రాం మొదట్లో ఫోటోలు, వీడియోలు మాత్రమే షేర్ చేసుకునే విధంగా స్టార్ట్ అయ్యి, ఇపుడు డిఫరెంట్ అప్డేట్లతో యూజర్స్ ను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇటువంటి అప్డేట్లు యూత్ అలాగే కంటెంట్ క్రియేటర్స్ కు మరెంతో ఉపయోగపడుతుంది.
వీలని దృష్టిలో పెట్టుకొని ఇపుడు కొత్త లైవ్ వీడియో రూమ్స్ లో నలుగురితో ఒక్కేసారి మాట్లాడచ్చు. ఇండియాలో  బీటా టెస్టింగ్స్ చేసింది, అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ ఇండియా మరియు ఇండోనేషియా యూజర్లుకు అందుబాటులో ఉంటుంది.
సింపుల్ స్టెప్స్ తో లైవ్ రూమ్ ఫీచర్ ని ఉస్ చేయొచ్చు, ఎలా అంటే ఫస్ట్ యువర్ స్టోరీలో ఉన్న ప్లస్‌ సింబల్‌పై క్లిక్ చేయాలి, తరువాత లైవ్ కెమెరా ఆప్షన్ పై క్లిక్  చేసి సెషన్ నేమ్ టైపు చేయాలి. ఇప్పుడు లైవ్ ఆన్ చేసి, వీడియో కెమెరా సింబల్ పై క్లిక్ చేసి మీరు ఎవరితో ముచ్చటించాలో వారిని ఆడ్ చేసుకోవచ్చు. కేవలం లైవ్ లో ఉన్నవాలిని ముగ్గురిని మాత్రమే ఆడ్ చేయాలి అని లైవ్ స్టార్ట్ చేసే ముందు గమనించుకోండి.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు