ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్, షాక్ అయ్యిన యూజర్లు

ఒక్కసారిగా ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. చాలా మందికి ఇది తెలియక మొబైల్ ప్రాబ్లెమ్ అనుకుని యాప్ ని అన్‌ఇన్‌స్టాల్ చేసి డౌన్లోడ్ చేసుకున్నారు. అయినా కూడా ఇన్‌స్టాగ్రామ్ మల్లి ఆగిపోయింది.

ఈసారి ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్, షాక్ అయ్యిన యూజర్లు

స్మార్ట్ ఫోన్లో ఎన్ని సోషల్ మీడియా యాప్స్ ఉన్న, ఇన్‌స్టాగ్రామ్ మటుకు అందరికి హాట్ ఫేవరెట్. ఎందుకంటే ఇందులో ఫోటో/ వీడియో షేరింగ్ తో పాటు రీల్స్, ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్, స్టోరీస్ లతో ప్రపంచం మొత్తం అందరిని ఆకట్టుకుంది. ఒక్కసారిగా ఇన్‌స్టాగ్రామ్ ఆగిపోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అయ్యారు. చాలా మందికి ఇది తెలియక మొబైల్ ప్రాబ్లెమ్ అనుకుని యాప్ ని అన్‌ఇన్‌స్టాల్ చేసి డౌన్లోడ్ చేసుకున్నారు. అయినా కూడా ఇన్‌స్టాగ్రామ్ మల్లి ఆగిపోయింది.

అసలు ఏం జరిగిందంటే శుక్రవారం సాయంత్రం సడన్ గా.. పలు సమస్యల కారణంగా ప్రపంచం మొత్తం ఆగిపోవడంతో #InstagramCrashing హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్ లో ట్రెండ్ చేసారు. కాసేపు పని చేయకపోయినా ఇన్‌స్టాగ్రామ్ తరువాత కొంచెం సేపటికి సెట్ అయ్యింది. ఇంతలో మీమ్స్, రియాక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్ పై చాలా ట్రోలింగ్ అండ్ కామెంట్స్ వచ్చాయి అనుకోండి.

కానీ నిపుణులు మాత్రం వినియోగదారులు ఎక్కువ ఉండటంతో సమస్య వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. ఇంకో పక్క ప్రాబ్లెమ్ పరిష్కరించబడింది అని చెబుతున్న యూజర్లు మాత్రం యాప్ సరి పనిచేయడంలేదు అని కంప్లైంట్ చేస్తున్నారు. గూగుల్ సర్వీసులు జీమెయిల్, యూట్యూబ్, గూగుల్ డ్రైవ్ ప్రపంచవ్యాప్తంగా ఈ వారం మొదట్లో క్రాష్ అయ్యిందని సంగతి తెలిసిందే.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు