ఎంఐ 11 వచ్చేస్తుంది; డిసెంబర్ 29న లాంచ్

షియోమీ ఎంఐ 11 మొబైల్స్ చైనాలో రిలీజ్ చేస్తారా లేదా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల చేస్తారా అనేది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

ఎంఐ 11 వచ్చేస్తుంది; డిసెంబర్ 29న లాంచ్

షియోమీ ఎంఐ 11 మొబైల్స్ లాంచ్ చేస్తునట్టు ఒక నివేదిక ప్రకారం తెలుస్తుంది. అది కూడా డిసెంబర్ 29 వ తారీఖున లాంచ్ చేస్తున్నట్లు న్యూస్. షియోమి సహ వ్యవస్థాపకుడు, సిఇఒ లీ జూన్ మాట్లాడుతూ, షియోమీ ఎంఐ 11 మొబైల్స్ సరికొత్త క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని చెప్పారు. వాంగ్ టెంగ్ థామస్, వీబోలో రెడ్‌మి ప్రొడక్ట్ డైరెక్టర్ కెమెరా శాంపిల్ ని వీడియో రూపంలో వివరించగా, ఇప్పుడు నెట్టింట్లో ఆ వీడియో వైరల్ అవుతుంది. గిజ్మో చైనా వెబ్ సైట్ షేర్ చేసిన నివేదిక ప్రకారం తెలుస్తుందేంటంటే ఈ నెల ఆఖరిలో షియోమీ ఎంఐ 11 మొబైల్స్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పుడు షియోమీ ఎంఐ 11 మొబైల్స్ చైనాలో రిలీజ్ చేస్తారా లేదా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల చేస్తారా అనేది పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నివేదికలో ఉన్న షియోమీ ఎంఐ 11 మొబైల్స్ గురించి చెప్పాలంటే ఇది 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని, సెల్ఫీ కోసం పంచ్ హోల్ కెమెరా తీసుకురానున్నారు.

లీకైన ఫోటోల ప్రకారం, ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి, పెద్ద మార్పులు చేసినట్లు అర్ధమవుతుంది. రెండు పెద్ద కెమెరా టెలిఫోటో కెమెరా సెన్సార్లు, మూడవ కెమెరా మాక్రో కెమెరా కలిగి ఉంటుంది. 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో QHD ప్లస్ ఏఎంఓఎల్ఈఢీ డిస్ప్లే తో పాటు 10టీ ప్రోలో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను తీసుకొచ్చారు. షియోమీ ఎంఐ 11 మొబైల్స్ నీలం, వైట్ గ్రేడియంట్ రంగులలో లభిస్తుంది.

ఎంఐ 11 ధర విషయానికి వస్తే, సుమరు 44,000 నుండి 50,000 రూపాయలు వరుకు ఉండొచ్చు. ఒకవేళ దీని ప్రో వెర్షన్ రేట్ గురించి మాట్లాడితే సుమారు 60,000 రూపాయలు ఉంటుందని అంచనా. ర్యామ్, స్టోరేజ్ బట్టి దీని ధర మారుతుందని గమనించాలి. చూస్తుంటే కొన్ని కొత్త టెక్నాలజీ బేస్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు, మరి ఎంతవరుకు కస్టమర్లను ఆకట్టుకుంటుందో చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు