కేసులో చిక్కుకున్న గూగుల్ – మరి ఫైన్ ఎంత పడిందో?

సెర్చ్, యాడ్స్ వంటి పై ఆధిపత్యం పెంపొందించడానికి యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందని కాలిఫోర్నియా లోని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా వేసినట్టు సమాచారం.

కేసులో చిక్కుకున్న గూగుల్ - మరి ఫైన్ ఎంత పడిందో?

“గూగుల్” ఈ పేరు తెలియని వాళ్ళు అసలు ఉండరు, ఎందుకంటే ఇది ఎంతో సుపరిచితం. మనకి ఏదైనా విషయం తెలికపోతే వెంటనే ఫోన్ తీసి ఇందులో వెతుకుతాం. అందుతున్న న్యూస్ ఏంటంటే, ఈసారి గూగుల్ కి ఒక చేదు అనుభవం ఎదురైంది, అమెరికా గవర్నమెంట్ గూగుల్ పై కేసు విధించింది. దీనికి ముఖ్య కారణం, గూగుల్ కార్యకలాపాలు అయిన సెర్చ్, యాడ్స్ వంటి పై ఆధిపత్యం పెంపొందించడానికి యాంటీట్రస్ట్ చట్టాన్ని ఉల్లంఘించిందని కాలిఫోర్నియా లోని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దావా వేసినట్లు సమాచారం.

కాలిఫోర్నియా డెమొక్రాట్ రాష్ట్ర అటార్నీ జనరల్ ‌బహిరంగంగా దీనికి సపోర్ట్ చేసారు. ఈ ఆరోపణలు అన్ని గూగుల్ ఖండించింది.. అలాగే గతంలో కూడా పలు రాష్ట్రాలు గూగుల్ పై 73 కోట్లు జరిమానా విధించాలని కోర్టుని ఆశ్రయించారు. సెర్చ్ మరియు యాడ్స్ విషయంలో వినియోగదారులు వారి అభిప్రాయాలూ ఎప్పటికి అప్పుడు మారుతుంటాయని, ఎవరో బలవంతం చేస్తే గూగుల్లో సెర్చ్ చేయరు అని ఆ సంస్థకు చెందిన ప్రధాన ప్రతినిధి వివరించారు. గూగుల్ పై కేసును కోర్టులో మేమే కొనసాగిస్తాము అని తెలపగా, కేసుకి సంబంధించిన న్యాయమూర్తి అమెరికా జిల్లా జడ్జి అమిత్ మెహతా గూగుల్ ని డిసెంబర్ 18వ రాబోయే విచారణకు తప్పకుండా స్పందించమని తెలిపారు.

ఈ దావా యొక్క ముఖ్య ఉద్దేశం గూగుల్ ఇతర సంస్థల వ్యాపార పద్ధతుల్లో మార్పులను బలవంతం సూచిస్తోందని అమెరికా ప్రభుత్వం తెలిపింది. అంతకముందు యూరోపియాన్ యూనియన్ లో కూడా ఇటువంటి కారణం ద్వారానే గూగుల్ పై కేసులు పెట్టి జరిమానాలను విధించారు, ఐతే అందుకు తగట్టు గూగుల్ కూడా ఆ కేసులపై రకరకాల సవాలు విసిరింది. ఇక పై ఏం జరుగుతుందో, డిసెంబర్ 18న జరిగే తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు