గూగుల్ మ్యాప్స్ లో మరో ఫీచర్ : “గో ” టాబ్

మనం వెళ్లిన ప్రతి ప్లేస్ ని కూడా పిన్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది. దూర ప్రాంతాలతో పాటు రెగ్యులర్ గా వెళ్ళే ప్రదేశాలు స్కూల్స్, కాలేజస్, సినిమా హాళ్లు వంటి మరెన్నో కూడా పిన్ చేసుకోవచ్చు.

గూగుల్ మ్యాప్స్

వీకెండ్ లేదా ఏదైనా హాలిడేస్ వచ్చినపుడు కొత్త కొత్త ప్లేసెస్ కి, లాంగ్ డ్రైవ్స్ కి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తాం. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలుతో పాటు ఎంత దూరం వెళ్లాలనుకుంటున్నాము, ఎంత టైం పెట్టచ్చు, ట్రాఫిక్ ఎంత ఉంది వంటి విషయాలు తెలుసుకోవాలి అంటే వెంటనే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి చూస్తాం. గూగుల్ మ్యాప్స్ కూడా తరుచు మన అవసరానికి తగట్టు ఏదొక కొత్త అప్డేట్ ని తీసుకు వస్తుంది.

లేటెస్టుగా ఇపుడు గూగుల్ మ్యాప్స్ ఒక కొత్త ఫీచర్ ని తీసుకురాబోతుంది  అదే ‘గో’ టాబ్. దీని స్పెషలిటీ ఎంటంటే, యూజర్ గతంలో సందర్శించిన ప్రదేశాలకు ఈజీగా నావిగేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం వెళ్లిన ప్రతి ప్లేస్ ని కూడా పిన్ చేసుకునే వెసులుబాటు ఇందులో ఉంటుంది. దూర ప్రాంతాలతో పాటు రెగ్యులర్ గా వెళ్ళే ప్రదేశాలు స్కూల్స్, కాలేజస్, సినిమా హాళ్లు వంటి మరెన్నో కూడా పిన్ చేసుకోవచ్చు. రాబోయే కొన్ని వారాల్లో అందరికి ఆండ్రాయిడ్ అండ్ ఆపిల్ వినియోగదారులకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది అని తెలిపింది.

అసలు అయితే ప్రస్తుతానికి ఇల్లు మరియు పని చేసే ఆఫీస్ ప్రదేశాలకి మాత్రమే సేవ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇక గో టాబ్ ఫీచర్ ద్వారా తరుచు వెళ్ళే ప్రదేశాలని కూడా సేవ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత వాహనాలలో, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ తో ప్రయాణం చేసినపుడు ఏ రూట్ లో తొందరగా చేరుతాం అని తెలుపుతుంది. ఇక పై ఎక్స్‌ప్లోర్, సేవ్డ్‌ ట్యాబ్స్‌ ఫీచర్‌ స్థానంలో గో టాబ్ ఫీచర్ లభిస్తుందని గూగుల్ మ్యాప్స్ సంస్థ తెలిపింది. చూస్తుంటే ఇది ప్రతి ఒకరికి ఉపయోగపడే ఫీచర్ అని తెలుస్తుంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు