డిజిటల్ గిఫ్ట్ కార్డులతో అల్లరించబోనున గూగుల్ పే

ఫైన్ లాబ్స్ యాజామాన్యంతో క్విక్ సిల్వర్ భాగస్వామి ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నామని గూగుల్ పే తెలిపింది

గూగుల్ పే డిజిటల్ గిఫ్ట్ కార్డు

సడెన్ గా ఫ్రెండ్ కి డబ్బులు అవసరమైతే బ్యాంకు కి వెళ్లి పంపాల్సిన అవసరం లేకుండా ఎన్నో డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మన స్మార్ట్ ఫోన్లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో గూగుల్ పే ఒకటి, ట్రాన్సాక్షన్ కి ఒక స్క్రాచ్ కార్డు లభించడం మరో విశేషం. అయితే తాజాగా డిజిటల్ గిఫ్ట్ కార్డులను తీసుకువస్తునట్టు ఆ సంస్థ ప్రకటించింది, ఫైన్ లాబ్స్ యాజామాన్యంతో క్విక్ సిల్వర్ భాగస్వామి ద్వారా అందుబాటులోకి తీసుకువస్తున్నామని గూగుల్ పే తెలిపింది.

ఇండియాలోని 1500 నగరాల్లో, 150 పైగా ఉన్న ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ కంపెనీలు యొక్క వర్చువల్ గిఫ్ట్ కార్డులను అందిస్తున్నట్లు వెల్లడించింది. అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్, ఉబెర్ ఇ-గిఫ్ట్, ఫ్లిప్‌కార్ట్ గిఫ్ట్ కార్డ్, గూగుల్ ప్లే గిఫ్ట్ కోడ్ మొదలైన బ్రాండ్లు లభ్యమవుతాయి. వీటితో పాటు కన్జ్యూమర్ బ్రాండ్ అయిన వోహో, క్విక్ సిల్వర్ వంటి కంపెనీలను జత చేసింది. డిజిటల్ గిఫ్ట్ కార్డులను..ఆఫ్‌లైన్ వ్యాపారాలుకు గూగుల్ పే సహాయంతో తయారుచేసుకోవచ్చు. వోహో, గూగుల్ పే భాగస్వామ్యంతో వినియోగదారులుకు వర్చువల్ గిఫ్ట్ కార్డులను కొనుగోలు చేస్తే ఆఫ్‌లైన్ రిటైల్‌ మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది.

జస్ట్ మీరు గూగుల్ పే లో వోహో సెర్చ్ చేస్తే చాలు వర్చువల్ గిఫ్ట్ కార్డును పంపవచ్చు లేదంటే బిజినెస్ ట్యాబ్ లో గిఫ్ట్ కార్డు స్టోర్ నుండి అయినా పంపవచ్చు. ఒకసారి ఆ డిజిటల్ గిఫ్ట్ కార్డును కొనుగోలు చేస్తే ఎస్సెమ్మెస్ మరియు ఈ మెయిల్ ద్వారా అయినా సెండ్ చేయొచ్చు. ఇలా పంపడం వలన రూ.500 వరకూ క్యాష్ బ్యాక్ రావటానికి అర్హులం అవుతాం. 10 బహుమతి కార్డులలో, కిరాణా మరియు ఫ్యాషన్ విభాగానికి సంధించినవి, మిగిలిన తొమ్మిది ఇ-కామర్స్ కు చెందినవి.

కన్జ్యూమర్ ఎక్స్‌పీరియన్స్ మరింత బెటర్ గా పొందటానికి, క్విక్ సిల్వర్.. వోహో డిజిటల్ కార్డ్ స్టోర్ ను ఆన్ చేసి ఉంచింది, బటన్ క్లిక్ చేయంగానే డిజిటల్ గిఫ్టింగ్ విధానం మొదలువుతుందని పైన్ ల్యాబ్స్ ప్రెసిడెంట్ కుమార్ సుదర్శన్ తెలియచేసారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు