త్వరలో మార్కెట్లోకి నోకియా 5.4 మొబైల్, కాస్ట్ 14వేలు

త్వరలో నోకియా 5.4 అనే కొత్త ఫోన్‌ను లాంచ్ కు సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అయితే ఇది నోకియా 5.3 వెర్షన్ కి నెక్స్ట్ మోడల్ అని తెలుస్తుంది.

త్వరలో మార్కెట్లోకి నోకియా 5.4 మొబైల్ కాస్ట్ 14వేలు

నోకియా తన స్మార్ట్ ఫోన్ సిరీస్ లను మార్కెట్లోకి రిలీజ్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ హెచ్ఎండీ గ్లోబల్ త్వరలో నోకియా 5.4 అనే కొత్త ఫోన్‌ను లాంచ్ కు సిద్ధంగా ఉందని తెలుస్తుంది. అయితే ఇది నోకియా 5.3 వెర్షన్ కి నెక్స్ట్ మోడల్ అని తెలుస్తుంది. మీడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో నోకియా 5.4ను రిలీజ్ చేస్తునట్టు అధికారికంగా ధృవీకరించింది.

నోకియా 5.4 మోడల్ విషయానికి వస్తే, దీనిలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుందని..4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో, 6జీబీ ర్యామ్ + 64జీబీలో మొబైల్ లభిస్తుందని తెలిపారు. ఈ నెలాఖరు డిసెంబర్ 2020 లో లాంచ్ జరుగుతుంది అని, ప్రారంభ ధర సుమారు 14,000 పలుకగా, 2021లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

నోకియా 5.4 ఫీచర్లు గురించి చెప్పాలంటే, ఇది 6.39 అంగుళాల హెచ్ ఢీ ప్లస్ పంచ్ హోల్ డిస్ప్లే కలిగి ఆండ్రాయిడ్ 10 & ఆండ్రాయిడ్ 11 సపోర్ట్ ఇస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 48ఎంపీ(f1.8) + 2ఎంపీ డెప్త్ + 5ఎంపీ అల్ట్రావైడ్ + 2ఎంపీ మాక్రో కెమెరా , సెల్ఫీ కెమెరా 16ఎంపీ(f2.0) ఉండబోతుంది. మరిన్ని ఫీచర్లు విషియానికి వస్తే నానో సిమ్, జిఎస్ఎమ్/ఎల్‌టిఇ, బ్లూటూత్ 4.2, జిపిఎస్/ఎజిపిఎస్, గ్లోనాస్, బిడిఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, ఎన్‌ఎఫ్‌సి కనెక్టివిటీ తో లభిస్తుంది.

బ్యాటరీ 4000 ఎంఏహెచ్ కలిగి ఉండగా ..10వాట్ ఛార్జర్ తో నడుస్తుంది. దీని బరువు 181 గ్రాములు మరియు పోలార్ నైట్, డస్క్ రంగులలో నోకియా 5.4 అందుబాటులో ఉంటుందని నోకియా సంస్థ వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ కి కావాల్సిన అన్ని ఫీచర్లు ఉండి, మంచి ధర పలకడంతో మొబైల్ ప్రియులు దీనిపై మోజు చూపించే అవకాశం ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు