నెంబర్ వన్ రేసులో ఎయిర్‌‌టెల్: మరి జియో పరిస్థితి?

జియోకి చెక్ పెట్టేందుకు ఎయిర్టెల్ ప్రయత్నిస్తుందని తెలుస్తుంది

ఎయిర్‌‌టెల్

డిఫరెంట్ టెలికాం సర్వీసెస్ మనకి అందుబాటులో ఉండి వేర్వేరు సదుపాయాలు కాల్స్, మెసేజెస్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందిస్తుంది. ఎప్పుడైతే జియో మార్కెట్లోకి అడుగు పెట్టిందో, మిగిలిన టెలికాం సంస్థలకి జియో గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి. 4జీ సేవలను ఫ్రీగా తీసుకువచ్చి స్మార్ట్ ఫోన్ వినియోగదారులను తన వైపు తిప్పేసుకుందని చెప్పాలి. ప్రస్తుతానికి ఐతే టెలికాం కంపెనీస్ అన్నిటిలో , జియోకి ఎక్కువ కస్టమర్లు ఉండి మొదటి స్థానంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.

అందుతున్న సమాచారం ప్రకారం జియోకి చెక్ పెట్టేందుకు ఎయిర్‌‌టెల్ ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. నాలుగు సంవత్సరాలు తరువాత, ఎయిర్‌‌టెల్.. జియో కంటే ఎక్కువ కస్టమర్లను సంపాదించుకుంది. దీనితో అందరి ప్రశంసలను పొంది అట్రాక్షన్ గా నిలిచింది. ఇది ఎలా సాధ్యమయింది అంటే సెప్టెంబర్ నెలలో జియో కంటే రెంట్టింపు కస్టమర్లను ఎయిర్‌‌టెల్ సంపాదించుకుంది. ఎయిర్‌‌టెల్ 38లక్షల మందిని, జియో 15 లక్షల మంది వినియోగదారులను సాధించింది. ఎయిర్‌‌టెల్, ఈ రికార్డును నాలుగు సంవత్సరాలు తరువాత నమోదుచేసుకోవడం విశేషం.

ట్రాయ్, టెలికాం నియంత్రణ సంస్థ ప్రకారం.. వరుసగా రెండో నెలలో కూడా ఎయిర్‌టెల్, జియోను మించి వినియోగదారులను సంపాదించుకోగా, మరో పాపులర్ టెలికాం సర్వీసెస్ అయినటువంటి వోడాఫోన్-ఐడియా కస్టమర్లను పోగొట్టుకుంది. జియో కొత్తగా 0.36 మందిని పెంచుకొని..40.41 కో ట్లతో ఫస్ట్ ప్లేసులో ఉండగా, ఎయిర్‌టెల్ 1.17 శాతం కస్టమర్లు పెరిగి 32.66 కోట్ల వినియోగదారులతో సెకండ్ ప్లేసులో నిలిచింది. ఇక వోడాఫోన్-ఐడియా విషయానికి వస్తే 47 లక్షల వినియోగదారులను పోగొట్టుకొని 29.55 కోట్లకు తగ్గింది. ఒకవేళ ఎయిర్‌టెల్ ఇదే తీరును కొనసాగిస్తే జియోని మించి అగ్రస్థానానికి ఎగబాకడం ఖాయం అని అర్ధమవుతుంది

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు