నెట్ ఫ్లిక్స్ ఫ్రీ : 2 డేస్ మాత్రమే

డిసెంబర్ 5న 12:01 నిమిషాలకు మొదలుకుని, డిసెంబర్ 6న రాత్రి 11:59 నిమిషాలకు ఫ్రీగా చూసుకునే అవకాశం ఉంటుంది

నెట్ ఫ్లిక్స్

థియేటర్ కి వెళ్లి సినిమాలు చూడటం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు, మన డే-టు-డే బిజీ లైఫ్ లో సినిమాలు మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. ఇపుడు ఆ మాయదారి కరోనా వల్ల థియేటర్లు మూత పడటం, ఇంట్లోనే ఉండి OTT ప్లేట్ ఫార్మ్స్ లో సినిమాలు చూడటంతో వాటి యూజర్లు బాగానే పెరిగారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యిన OTT ప్లేట్ ఫార్మ్స్ లో సినిమాలు కి, వెబ్ సిరీస్ కి హద్దులే లేవు.

అయితే ఇపుడు  OTT ప్లేట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ 2 డేస్ ఫ్రీగా లభిస్తుంది.. అది కూడా రెండు రోజులు మాత్రమే. డిసెంబర్ 5, 6 తేదీల్లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ఫెస్ట్ ను ఇండియాలో నిర్వహిస్తుంది. కాబట్టి మూవీ లవర్స్ ఏ లాంగ్వేజ్ అయిన మూవీస్, సిరీస్ ఏదైనా 48 గంటలు పాటు ఫ్రీగా చూడొచ్చు అని తెలిపింది. డిసెంబర్ 5న 12:01 నిమిషాలకు మొదలుకుని, డిసెంబర్ 6న రాత్రి 11:59 నిమిషాలకు ఫ్రీగా చూసుకునే అవకాశం ఉంటుంది.

నెట్ ఫ్లిక్స్ మొదట ఇది మన దేశంలో ట్రయిల్ వేస్తున్నారు, ఒకవేళ ఇది సక్సెస్ అయితే మిగిలిన దేశాలకు కూడా అవకాశం ఇవ్వాలని చూస్తుంది. మిగిలిన స్ట్రీమింగ్ ప్లాటుఫార్మ్స్ కి గెట్టి పోటీ ఇవ్వడానికే నెట్ ఫ్లిక్స్  ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది. మీరు రెండు రోజుల పాటు ఎటువంటి పేమెంట్ లేకుండా వీడియో కంటెంట్ ని వీక్షించగలరు.

నెట్ ఫ్లిక్స్ ఫ్రీగా విషించే సదుపాయం కావాలంటే మీరు చేయాల్సింది జస్ట్ మీ ఇమెయిల్ ఐడి లేదా మీ మొబైల్ నెంబర్ లేదా మీ నేమ్ ఇచ్చి సైన్ అప్ అవ్వటమే. ఒకరి లాగిన్ డీటెయిల్స్ మరొకరు యూస్ చేసుకోకూడదు అని నెట్ ఫ్లిక్స్ ముందే చెప్పడంతో ఎవరిది వాలు యూస్ చేసుకోడం బెటర్. సో, ఇంకేంటి లిస్ట్ అఫ్ మూవీస్ రెడీ చేసుకుని ఎంజాయ్ చేయండి మరి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు