న్యూ ఫీచర్ ని ఆడ్ చేసిన గూగుల్ మ్యాప్స్

ఇంకా ఇది డెవలప్మెంట్ స్టేజి లో ఉండటంతో త్వరలో అందరికి సపోర్ట్ చేస్తుంది.

గూగుల్ మ్యాప్స్

ఒక్కొక్కసారి మనం అవసరానికి తెలియని ప్లేసెస్ కి వెళ్తూ ఉంటాం.. బట్ మనకి రూట్ తెలీదు. వెంటనే ఫస్ట్ చేసే పని గూగుల్ మ్యాప్స్  ఓపెన్ చేయటం, దీని సహాయంతో డెస్టినేషన్ రీచ్ అవుతాం. యూజర్లకు ఉపయోగపడేలా ఎప్పటికపుడు గూగుల్ మ్యాప్స్ ను అప్డేట్ చేస్తూ ఉంటుంది.. సో ఇంకా ఈజీగా లొకేషన్ ఫైండ్ చేయొచ్చు. ఇపుడు లేటెస్ట్ గా ఇంకో అప్డేట్ ని తీసుకు వచ్చింది గూగుల్ మ్యాప్స్ అదే “రైడ్ సర్వీసెస్”.

ఈ కొత్త రైడ్ సర్వీసెస్ గూగుల్ మ్యాప్స్ ఇంట్రడ్యూస్ చేస్తునట్టు బీటా నివేదిక ద్వారా తెలుస్తుంది. మ్యాప్స్ నుండి రైడ్-షేరింగ్ కంపెనీకి రూట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో సరైన చార్జెస్ ని తెలుసుకోవచ్చు. ప్రెసెంట్ న్యూ ఫీచర్ ను ఉబెర్ కు మాత్రమే వర్క్ చేస్తుంది.. బట్ ఇది డిఫరెంట్ ప్లేసెస్ విభిన్నంగా ఉండవచ్చు. ఇంకా ఇది డెవలప్మెంట్ స్టేజి లో ఉండటంతో త్వరలో అందరికి సపోర్ట్ చేస్తుంది.

బీటా నివేదిక లో ఇంకా ఏం ఉంది అంటే క్రాస్ వాక్ సింబల్స్ మరియు బిల్డింగ్ నంబర్స్ ను జత చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం పాపులర్ సిటీస్ లో మాత్రమే ఈ సర్వీసెస్ అందుబాటులో ఉంటుందని.. మరిన్ని సిటీస్ లోకి త్వరలో విస్తరించునట్లు నివేదికలో ఉంది.

మరిన్ని నివేదిక విశేషాలుకి వస్తే, న్యూయార్క్ వంటి స్స్ట్రీట్స్ లో మ్యాప్స్ ను జూమ్ చేసి చూస్తే క్రాస్ వాక్ సింబల్స్ మరియు బిల్డింగ్ నంబర్స్ ను గుర్తించవచ్చు అని అర్ధమవుతుంది. మరి ఇంకా ఈ కొత్త అప్డేట్ ఎంత క్లిక్ అవుతుందో చూడాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు