పండగ సీజన్ లో మార్కెట్లోకి షియోమీ మీ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ?

లేటెస్ట్ న్యూస్ ప్రకారం మీ 11 సిరీస్ తో ఫ్లాగ్షిప్ మొబైల్స్ జనవరి లాంచ్ అవ్వబోతున్నాయి అని ఒక నివేదికలో ద్వారా తెలుస్తుంది. మీ 11 తో పాటు మీ 11 ప్రో మొబైల్స్ ను ఇండియాలో లాంచ్ కు షియోమీ కంపెనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది

షియోమీ మీ 11 సిరీస్

డిసెంబర్, జనవరి అనగానే మనకి పండగలు, సెలవులు గుర్తొస్తాయి, దీనితో పాటు మనం కొత్త వస్తువులు కొనటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాం. ఎందుకంటే ఇటువంటి సమయంలోనే, మరిన్ని ఆఫర్లు లభిస్తాయి కాబట్టి. ఇప్పుడు ఈ లిస్ట్ లో షియోమీ కూడా చేరింది, తన తదుపరి మీ 11 సిరీస్ జనవరి 2021 నాటికీ రిలీజ్ చేస్తకీ సిద్ధమైంది. మీ 10 సిరీస్ తర్వాత తొందర్లో న్యూ సిరీస్ అప్డేట్ కోసం నెట్లో ఎన్నో షికార్లు కొట్టాయి.

లేటెస్ట్ న్యూస్ ప్రకారం మీ 11 సిరీస్ తో ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ జనవరి లాంచ్ అవ్వబోతున్నాయి అని ఒక నివేదికలో ద్వారా తెలుస్తుంది. మీ 11 తో పాటు మీ 11 ప్రో మొబైల్స్ ను ఇండియాలో లాంచ్ కు షియోమీ కంపెనీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇకపోతే షియోమీ మీ 11 మరియు షియోమీ మీ 11 ప్రో స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ ఒక్కటే ఉండబోతుందని అలాగే 875 ప్రాసెసర్ తో మొట్టమొదటి చైనీస్ ఫోన్‌గా గుర్తింపు పొందింది. మరిన్ని ప్రత్యేకతలు గురించి మాట్లాడితే, మీ 11 సిరీస్ మొబైల్స్ అనేవి,షియోమీ మీ 10 ప్రో అప్ గ్రేడ్ వెర్షన్ అని సమాచారం.

స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ వలన, దీని పవర్ ఎఫిసియెంసీ స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ కంటే 20% మరియు శక్తి 10% ఎక్కువ ఉంటుంది. మీ 11 సిరీస్ మొబైల్స్ లో WQHD + ప్యానెల్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు డిస్ప్లేతో పాటు స్నాప్‌డ్రాగన్ క్వాల్‌కామ్ చిప్‌సెట్ లభిస్తుంది. ఆపిల్ A14 బయోనిక్ చిప్‌సెట్ కంటే, ఈ చిప్ సెట్ ఫాస్ట్ గ పని చేస్తుంది, ఇంకా కెమెరా విషయానికి వస్తే ప్రధాన కెమెరా 108-మెగాపిక్సెల్ నుండి 192-మెగాపిక్సెల్స్ వరకు ఉండగా.. ఇతర లెన్స్‌లలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ అప్‌గ్రేడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండబోతుంది. మీ 11 సిరీస్ రిలీజ్ ఆఫీసియల్ గ చెప్పకపోగా, నివేదిక బట్టి చైనా 2021 జనవరి నాటికి కంపెనీ ప్రారంభించాలని అలాగే శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 30 సిరీస్ లాంచ్ కి ముందే మీ సిరీస్ రిలీజ్ చేయాలని ఆలోచనలో షియోమీ సంస్థ ఉందని తెలుస్తుంది. మొదట చైనా లో చేసిన తరువాత మిగిలిన దేశాలలో లాంచ్ చేయాలనీ అనుకుంటుంది షియోమీ.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు