బాగానే ఖర్చు పెట్టారు.. ఐఫోన్ 12 సిరీస్ కి – ఎంత అంటే?

జపాన్ కంపెనీ ఫోమల్హాట్ టెక్నో సొల్యూషన్స్ నిపుణులు ప్రకారం ఐఫోన్ 12 సిరీస్ లో వాడిన పరికరాలు బయటపెట్టింది

ఐఫోన్ 12 సిరీస్
స్మార్ట్ ఫోన్ అనగానే శాంసంగ్, వివో, రెడ్ మీ గుర్తొస్తాయి.. ఒకవేళ ఖరీదైన స్మార్ట్ ఫోన్ అనగానే ఐఫోన్ ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే. ఐఫోన్ క్రేజ్ మన దేశంలో అంత ఇంత కాదు, అందుకే ఐఫోన్ 12 సిరీస్ భారతదేశంలో ప్రారంభించారు. ఇపుడు అందరకి ఒకటే డౌట్ అసలు ఐఫోన్ 12 సిరీస్ ఎందుకు ఇంత కాస్ట్ అని? వివరాల్లోకి వెళ్ళితే ఐఫోన్ 12 ప్రో మాక్స్ ధర 1,49,900/-.
ఒక ఫోన్ తయారు చేయటానికి యూజ్ చేసిన పరికరాలు సాఫ్ట్ వెర్ బేస్ చేసుకుని ఫోన్ కాస్ట్ డిసైడ్ అవుతుంది. దీని గురించి జపాన్ కంపెనీ ఫోమల్‌హాట్ టెక్నో సొల్యూషన్స్ నిపుణులు ప్రకారం ఐఫోన్ 12 సిరీస్ లో వాడిన పరికరాలు బయటపెట్టింది. ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ మొబైల్స్ లో మెటీరియల్స్ మరియు వాటి కాస్ట్ ని నిక్కీ ఆసియా, (బోమ్) సహకారంతో ఒక నివేదికలో వెల్లడించారు. దీని బట్టి ఐఫోన్ 12 తయారీకి అయిన ఖర్చు రూ .27,550 కాగ, ఐఫోన్ 12 ప్రో మాక్స్ కు రూ.30,000 అయ్యిందని నివేదికలో తెలుస్తుంది.
అమెరికాలో ఐఫోన్ 12 అండ్ ఐఫోన్ ప్రో మాక్స్ 799 డాలర్లు, 999 డాలర్లు కు అమ్ముతున్నారు. అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఐఫోన్ మెటీరియల్ ఖర్చుతో పాటు మార్కెటింగ్, పన్నులు, అభివృద్ధి అండ్ పరిశోధన అన్ని కలిపి ఫైనల్ రేట్ ను ఫిక్స్ చేస్తది.
ఐఫోన్ 12 సిరీస్ కి వాడిన పరికరాలు:
 శాంసంగ్ రూపొందించిన ఓఎల్ఈడి డిస్ప్లేలు ధర 5,200/-
 క్వాల్కమ్ X55 5G మోడెమ్ ధర 6700/-.
రామ్ కి 950/- రూపాయలు ఖర్చు
ఫ్లాష్ మెమరీ ఖర్చు 1420/- రూపాయలు
టీ సోనీ కెమెరా సెన్సార్లు కొత్త ఐఫోన్ 12కి యూజ్ చేసారు, దాని ధర యూనిట్ కి 550/- నుండి 590/- ఉంటుంది.
దక్షిణ కొరియా నుండి 26% రాగా, అమెరికా మరియు జపాన్ నుండి 21.9%, 13.6% ప్రాంతాల నుండి ఐఫోన్ 12 ఉపయోగించే భాగాల వచ్చాయి. కానీ ఇప్పటికి ఐఫోన్ అసెంబుల్ అవ్వటానికి చైనా నుండి ఎక్కువ శాతం వస్తాయి అని గుర్తించాలి.
మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు