మరో కొత్త వైరస్- 2కోట్ల చైనా మొబైల్స్ లో

జియోనీ ఫోన్లలో ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా స్మార్ట్ ఫోన్లో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను సంస్థ ప్రవేశపెట్టినట్లు, చైనా జడ్జిమెంట్ డాక్యుమెంట్ నెట్వర్క్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం తెలుస్తుంది

జియోనీ

సిటీ దగ్గర నుండి పల్లెటూరు వరుకు, ప్రపంచంలో ఏ మూలలో అయినా వైరస్ పేరు వినగానే అందరికి చైనా దేశమే గుర్తొస్తుంది. మరి ఇంతలా గుర్తుపెట్టుకోవడానికి కారణం..అక్కడ పుట్టిన కరోనా వైరస్, మానవ జీవితాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఇపుడు తాజాగా మరో వైరస్ మార్కెట్లో హల చల్ చేస్తుంది, కానీ ఈసారి వైరస్ ని స్మార్ట్ ఫోన్లో కొనగొన్నారు. అది కూడా చైనా కంపెనీ మొబైల్స్ లోనే.

జియోనీ కంపెనీ చైనాలో ఒక భారీ మోసం వేలుగులోకి వచ్చింది..జియోనీ మొబైల్స్ కి సంబంధించి చైనాలో ఒక న్యాయస్థానం తీర్పుని ఇచ్చింది. జియోనీ ఫోన్‌లలో ఉద్దేశపూర్వకంగానే 2 కోట్లకుపైగా స్మార్ట్ ఫోన్లో ట్రోజన్ హార్స్ అనే వైరస్ ను సంస్థ ప్రవేశపెట్టినట్లు, చైనా జడ్జిమెంట్ డాక్యుమెంట్ నెట్‌వర్క్ ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం తెలుస్తుంది. 2018 డిసెంబర్ నుండి 2019 అక్టోబర్ వరకు జియోనీ ఫోన్లలలో ఒక యాప్ ద్వారా ఉద్దేశపూర్వకంగా ట్రోజన్ హార్స్‌ వైరస్ ను ప్రవేశపెట్టినట్టు కోర్టు తీర్పుని వెల్లడించింది.

“స్టోరీ లాక్ స్క్రీన్” అనే స్పెషల్ యాప్ ద్వారా యూజర్లు నుండి యాడ్స్ మరియు  చట్టవిరుద్ధ మార్గాలతో లాభాలుగా ఉపయోగపడింది అని నివేదిక లో ఉంది. ఇంకా ఈ యాప్ అప్డేట్ వలన ఫోన్లలో వైరస్ అమర్చడానికి షెన్‌జెన్ జిపు టెక్నాలజీ(జియోనీ యొక్క అనుబంధ సంస్థ)తో ఒప్పందం కుదర్చుకున్నట్లు..వినియోగదారుకు తెలియకుండా సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్ గా జియోనీ మొబైల్ ఫోన్‌లలో అప్డేట్ చేసారని కోర్ట్ తెలిపింది. ఇందుకోసం జియోనీ 40 లక్షల కోట్లు సమర్పించుకున్నట్లు ఉండగా, 2018లో ఫస్ట్ టైం వైరస్ ను మొబైల్స్ లో ఇన్‌స్టాల్ చేయడం మొదలుపెట్టి, అక్టోబర్ 2019 వరకు కొనసాగించినట్లు ఉంది.

ఇలా దాదాపుగా 2కోట్ల ఫోన్లలో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. గ్జూ లి, జో యింగ్, జియా జెంగ్కియాంగ్, పాన్ క్వి లను దోషులుగా తేల్చి .. 3 నుంచి 3.5 సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 23 లక్షల చొప్పున ఫైన్ ని కోర్ట్ విధించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు