మల్టీ-ఫోల్డబుల్ ఫోన్.. కొత్తగా ఉంది కదా.. !

శామ్సంగ్ మల్టీ-ఫోల్డబుల్ ఫోన్ తాయారు చేయడానికి ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంది. ఒక్కోసారి రెండు ముడతల ఫోన్ తాలూకా డ్రాయింగ్స్ అప్పుడపుడు నెట్ లో రిలీజ్ చేస్తూ ఉంటది.

శామ్సంగ్ మల్టీ-ఫోల్డబుల్ ఫోన్

మనకి కీ-ప్యాడ్ ఫోన్ తెలుసు, ఫోల్డబుల్ ఫోన్ తెలుసు..కానీ ఏంటి ఈ మల్టీ-ఫోల్డబుల్ ఫోన్ అని ఆలోచిస్తున్నారా? ఫేమస్ డిజిటల్ సంస్థ శామ్‌సంగ్ మల్టీ-ఫోల్డబుల్ ఫోన్ తాయారు చేయడానికి ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంది. ఒక్కోసారి రెండు ముడతల ఫోన్ తాలూకా డ్రాయింగ్స్ అప్పుడపుడు నెట్ లో రిలీజ్ చేస్తూ ఉంటది.

బట్.. ఈసారి ఏకంగా డబల్ ఫోల్డబుల్ మొబైల్ యానిమేటెడ్ ఇమేజస్ ని వెబ్ సైట్ లో విడుదల చేసింది. ఫోటో ద్వారా గమనిస్తే మల్టీ-ఫోల్డబుల్ ఫోన్ స్క్రీన్ ని ఓపెన్ చేయగానే అది కంప్లీట్ గ వన్ ట్యాబ్ స్క్రీన్ డిస్ప్లే గ మారిపోతుందని తెలుస్తుంది. మళ్ళి ఫోల్డ్ చేయగానే నార్మల్ మొబైల్ లాగానే ఉంటుంది.

ఇంకా ఆ యానిమేటెడ్ ఫోటో ని పరీక్షించగా మొబైల్ మడతపెట్టినపుడు z- ఫ్లిప్ మెకానిజం వలె ఆకృతి కనిపిస్తుంది. అట్లాగే మొబైల్ లెఫ్ట్ సైడ్ పార్ట్ లోపలికి  వెళ్లగా, రైట్ సైడ్ మాత్రం సాధారణ టచ్ స్క్రీన్ మొబైల్ లాగా పనిచేస్తుందని అర్ధమవుతుంది.

శామ్‌సంగ్ మల్టీ-ఫోల్డబుల్ మొబైల్ యూస్ చేస్తున్నపుడు మనకి పెద్ద టాబ్లెట్ వాడుతున్న అనుభవం కలుగుతుంది. ఈ ఫోల్డబుల్ మొబైల్స్ మడతపెట్టినప్పుడు స్క్రీన్ దెబ్బతినడం లేదా దాని జీవితకాలం వంటి ప్రధాన సమస్యలు ఎదురవుతాయి. అందుకని ఈసారి ఇటువంటి సమస్యలు ఎదురవకుండా తగని జాగ్రత్తలతో శామ్‌సంగ్ మల్టీ-ఫోల్డబుల్ ఫోన్ ని తాయారు చేయటానికి సిద్దమైయింది.

ఒకవేళ కాస్ట్ గనుక అందరికి అందుబాటులో ఉంటే ఈ మల్టీ-ఫోల్డబుల్ ఫోన్‌నుకొనడానికి మొబైల్ ప్రియులు మోజు చూపిస్తారు. ఎందుకంటే ఫోల్డబుల్ మొబైల్ z మోడల్ భారీ క్రేజ్ ని తెచ్చుకుంది. ఇటువంటి ఫోల్డబుల్ టైపు అఫ్ మొబైల్స్ మార్కెట్ లోకి తీసుకొచ్చింది శామ్‌సంగ్  కంపెనీ మాత్రమే.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు