మళ్ళీ ఐఫోన్లోకి టచ్‌ఐడీ ఫింగర్ ప్రింట్ స్కానర్?

ఐఫోన్ 13 సిరీస్‌లో టచ్‌ఐడి అనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సాంకేతికతను మళ్ళీ తీసుకువస్తుంది, ఇదివరకు లాగా ఐఫోన్ 13 టచ్ఐడి సెన్సార్ స్క్రీన్ దిగువన క్రింద ఉండబోదు అని డిస్ప్లే కింద ఉంటుంది

మళ్ళీ ఐఫోన్లోకి టచ్‌ఐడీ ఫింగర్ ప్రింట్ స్కానర్?

స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎన్ని ఉన్న, ఆపిల్ కంపెనీ ప్రత్యేకత వేరు. ఆ సంస్థ కూడా ఐఫోన్ ప్రియులను దృష్టి లో పెట్టుకొని వారి అభిరుచుల తగట్టు ఐఫోన్ సిరీస్ ను లాంచ్ చేస్తుంది. ఇప్పుడు ఐఫోన్ 12 లాంచ్ అయినా కొద్ది నెలలకే ఐఫోన్ 13 మోడల్ గురించి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఐఫోన్ 13 రిలీజ్ చేయడానికి దాదాపుగా ఒక సంవత్సరం టైం ఉన్నపటికీ, దాని మోడల్ ఫీచర్స్ పై పలు వార్తలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళ్తే తాజాగా ఒక టిప్‌స్టర్ జాన్ ప్రాసెసర్ ఐఫోన్ 13 గురించి మీడియాతో వివరించారు. ఐఫోన్ 13 సిరీస్‌లో టచ్‌ఐడి అనే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సాంకేతికతను మళ్ళీ తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. అంతే కాదు మరో ట్విస్ట్ కూడా ఉందని చెప్పారు, అది ఇదివరకు లాగా ఐఫోన్ 13 టచ్ఐడి సెన్సార్ స్క్రీన్ దిగువన క్రింద ఉండబోదు అని డిస్ప్లే కింద ఉంటుందని చెప్పారు.

అసలు టచ్ఐడి సెన్సార్ ఇదివరుకే డిస్ప్లే కింద శామ్‌సంగ్, వివో, ఒప్పో వంటి మరిన్ని ఫోన్ల కంపెనీలలో చూసుంటారు. ఇప్పుడు ఐఫోన్ 13 కూడా ఉంటుందని వెల్లడించారు. దీనితో పాటు కొత్త ఆపిల్ ఐప్యాడ్ ఎయిర్‌లో కూడా టెక్, పవర్ బటన్‌పై టచ్‌ఐడిని తీసుకురావచ్చు అని ప్రకటించారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు