రెడ్ మీ 9 పవర్ ఫీచర్లు అదుర్స్..మరి కాస్ట్ ఎంతో?

రెడ్ మీ 9 పవర్ భారత్ లో విడుదల .. క్వాడ్ రియర్ కెమెరా సెటప్, వాటర్డ్రాప్ డిస్ప్లే నాచ్ తో .. తాజా ఎంఐయుఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి రూపొందించబడింది.

రెడ్మీ 9 పవర్ ఫీచర్లు అదుర్స్..మరి కాస్ట్ ఎంతో?

స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఈసారి బడ్జెట్ ధరలో మొబైల్ ప్రియులకు రూపొందించి విడుదల చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు రెడ్‌మీ 9 పవర్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఇది క్వాడ్ రియర్ కెమెరా సెటప్, వాటర్‌డ్రాప్ డిస్ప్లే నాచ్‌తో.. తాజా ఎంఐయుఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ కలిగి ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, స్టీరియో స్పీకర్లు, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. రెడ్‌మి నోట్ 9 4జీ రీబ్రాండ్ గా రెడ్‌మీ 9 పవర్ మొబైల్ తీసుకొచ్చినట్టు సమాచారం. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11, వివో వై 20, ఒప్పో ఎ53లకు పోటీగా రెడ్‌మీ 9 పవర్ స్మార్ట్ ఫోన్ రూపొందించారు.

రెడ్‌మీ 9 పవర్ ఫీచర్స్ గురించి మాట్లాడితే డ్యూయల్ నానో సిమ్, 6.53-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ (1,080×2,340) పిక్సెల్‌ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే ఉంది. మరిన్ని ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే 19.5 : 9 రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, అడ్రినో 610 జీపీయు, 4జీబీ ఎల్ పీఢీడీఆర్4ఎక్స్ ర్యామ్ తో జత చేయబడింది.

యూజర్లు ముఖ్యంగా కెమెరా ఫీచర్ పై మోజు చూపిస్తారు కాబట్టి.. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ సెకండరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. ఇక సెల్ఫీ కెమెరా వచ్చేసి ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. అలాగే ఈ సెల్ఫీ కెమెరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫేస్ అన్‌లాక్‌కు సపోర్ట్ చేయటం విశేషం.

128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు స్టోరేజ్ రెడ్‌మీ 9 పవర్ సపోర్ట్ ఇస్తుంది.  4జీ ఓఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఇందులో ఉన్నాయి. స్పీకర్ గురించి చెప్పాలంటే హై-రెస్ ఆడియో సర్టిఫికేట్ పొందిన స్టీరియో స్పీకర్లతో రెడ్‌మీ 9 పవర్ వస్తుంది. హెచ్ డీ వెబ్ స్ట్రీమింగ్‌కు సపోర్ట్ కోసం వైడ్‌విన్ ఎల్ 1 ధృవీకరణ కూడా పొందింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇందులో అందించటం మరో స్పెషలిటీ అని చెప్పొచ్చు.

రెడ్ మీ 9 పవర్ హై లైట్ ఏంటంటే, ఇది యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ కలిగి ఉండటం. బ్యాటరీ వచ్చేసి 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫైరీ రెడ్, మైటీ బ్లాక్ రంగులలో, 198 గ్రాముల బరువుతో రెడ్ మీ 9 పవర్ మన ముందుకు వస్తుంది. ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకునే వారు అమెజాన్, ఎంఐ.కాంల్లో డిసెంబర్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు సేల్ జరుగుతుందని ప్రకటించింది. తరువాత దీన్ని ఆఫ్ లైన్‌లో కూడా లభిస్తుందని వివరించింది.

రెడ్‌మీ 9 పవర్  ఇండియా లో ధర రూ.4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 10,999 ఉంటుంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.11,999గా ఉంది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు