రోబో తో కరోనా టెస్ట్ ..?

రిమోట్ కంట్రోల్ సహాయంతో పని చేసే రోబో

రోబో

2020 అనగానే మనకి కరోనా వైరస్ గుర్తొస్తుంది.. పైగా అది త్వరగా ఒక మనిషి నుండి ఇంకొకరికి ట్రాన్స్మిషన్ అవ్వటం తో అందరూ ఆందోళన చెందారు. ఈ భయంకరమైన వైరస్ ప్రపంచంలో ఎవరిని వదలలేదు ఆఖరికి రోగి సోకిన వారికి ట్రీట్మెంట్ ఇస్తున్న వైద్యులను కూడా వీడలేదు, దీనికి కారణం ట్రాన్స్మిషన్ అఫ్ డిసీస్. ఇటువంటి వైరస్ ను అరికట్టేందుకు హెల్త్ కేర్ విభాగం టెక్నాలజీ ద్వారా వైద్య సేవలను అందించాలని నిర్ణయించుకుంది. అందుకు తగట్టుగా రిమోట్ కంట్రోల్ సహాయంతో పని చేసే రోబో Cira-03ను ఒక ఈజిప్షియన్ ఇన్వెంటర్ తయారు చేసారు.

వైద్య సిబ్బంది ఈ వైరస్ నుండి గురికాకుండా ఉండటానికి ఈజిప్ట్ దేశ రాజధాని కైరో లో ఈ ఆధునిక రోబోను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్ట్ చేయగా, అది టెంపరేచర్ చెక్ చెయ్యటంతో పాటు కరోనా టెస్ట్ కూడా చేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీని పని తీరును చూసి అక్కడ సిబ్బంది ఇన్వెంటర్ ని మెచ్చుకున్నారు.

ఇంకొక హైలైట్ ఏంటంటే ఇది కేవలం SWAB టెస్ట్ మాత్రమే చెయ్యటం కాక, ఆసుపత్రిలో ఎవరైనా మాస్క్ ధరించకపోతే వార్నింగ్ ఇచ్చి మాస్క్ వేసుకోమని చెబుతుంది. ఆల్రెడీ మనిషి లాంటి ముఖం, చేతులు ఉన్న రోబోను వివిధ రకాలుగ ఆసుపత్రిలో ఉపయోగిస్తున్నారు, ఇంకా ఎన్నో విధాలుగా మనకి కావాల్సిన విధంగా రూపుదిద్దుకోవచ్చు అని ఈ Cira-03 ద్వారా అర్ధమవుతుంది.

ప్రజలు ముఖ్యంగా ఏదో బాక్స్ వచ్చింది అని భయపడకుండా అవగాహనా పెంచుకుని పరీక్షలు చేయించుకుంటే డాక్టర్లను సేవ్ చేసిన వాళ్ళు అవుతారు అని Cira-03 రోబో తయారు చేసిన మహమ్మద్ ఎల్ కోమీ, చెప్పుకొచ్చారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు