వాట్సాప్ వెబ్ వెర్షన్ కి మరో ఫీచర్

వీడియో/వాయిస్ కాల్ ఫీచర్ ని త్వరలో వెబ్ వెర్షన్ లో అందుబాటులోకి వస్తున్నట్టు వాట్సాప్ తన బ్లాగ్ లో ప్రకటించింది. ప్రస్తుతం ఇది బీటా వెబ్ వెర్షన్ వాళ్లకి అందుబాటులో ఉందని, తొందర్లో ఇది అందరూ ఉపయోగించచ్చు అని తెలిపింది.

వాట్సాప్ వెబ్ వెర్షన్ కి మరో ఫీచర్

ఏదైనా ఫోటో పంపించాలన, వీడియో షేర్ చేయాలన ఠక్కున గుర్తొచ్చేది వాట్సాప్. వీటితో పాటు వాయిస్ మరియు వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కలిపించింది. ప్రతిసారి ఏదొక అప్డేట్ ని తీసుకొచ్చి వినియోగదారులను అల్లరిస్తుంది వాట్సాప్. బట్ ఈసారి వినియోగదారులు కోసం ఒక అప్డేట్ తీసుకొచ్చింది అదే వీడియో/వాయిస్ కాల్ ఫీచర్. దీనిని త్వరలో వెబ్ వెర్షన్ లో అందుబాటులోకి వస్తున్నట్టు వాట్సాప్ తన బ్లాగ్ లో ప్రకటించింది. ప్రస్తుతం ఇది బీటా వెబ్ వెర్షన్ వాళ్లకి అందుబాటులో ఉందని, తొందర్లో ఇది అందరూ ఉపయోగించచ్చు అని తెలిపింది.

ఇకపై యూజర్లు మొబైల్ ఫోన్లో మాదిరిగానే వాట్సాప్ వెబ్ వెర్షన్ లో కూడా వీడియో/వాయిస్ కాల్ ఫీచర్ వాడచ్చు. వాయిస్, వీడియో కాల్ బటన్ చాట్ హెడర్‌లో ఉంటుందని వాట్సాప్ బ్లాగ్ లో స్క్రీన్ షాట్ షేర్ చేసింది. వాట్సాప్ వెబ్ లో కాల్ వస్తే మీకు ఒక పాప్-అప్ కనిపిస్తుందని, అందులో అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు లేదా విస్మరించవచ్చు అనే ఆప్షన్లు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ మనం ఎవరికైనా కాల్ చేసిన కూడా విండో పాప్-అప్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.

మొబైల్ వెర్షన్ వాట్సాప్ లాగానే ఇందులో కూడా వీడియో ఆఫ్, మ్యూట్ వాయిస్, రిజెక్ట్ బటన్ అనే ఆప్షన్స్ తీసుకొచ్చింది. ఇక ఈ ఫీచర్ ని ఉపయోగించాలి అంటే ఇంటర్నెట్ తప్పనిసరి. వాయిస్/వీడియో కాల్ ఫీచర్ మొబైల్ వెర్షన్ కి పరిమితం చేయకుండా వాట్సాప్ తమ వెబ్ వెర్షన్ కి కూడా తీసుకురావడం హర్షణీయం.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు