వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సాప్

ఛాటింగ్‌ చేసేప్పుడు ప్రతి ఛాట్‌ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను సెట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా సెట్ చేసుకోవటానికి ప్రత్యేకంగా వాల్‌పేపర్‌ గ్యాలరీ అప్‌డేట్ చేయడంతో వ్యక్తిగత చాట్‌ల వాల్‌పేపర్‌లను సెట్ చేసుకోవాడం సులువే మరి.

మరో కొత్త ఫీచర్ ని తీసుకొచ్చిన వాట్సాప్

ఎంతో సుపరిచితమైన ఇన్స్ టాన్ట్ మెసేజింగ్ అప్లికేషన్ “వాట్సాప్”. గుడ్ మార్నింగ్ మెసెజ్ దగ్గర నుండి గుడ్ నైట్ చెప్పే మెసేజ్ లు వరకు ఎక్కువగా యూజ్ చేసేది వాట్సాప్. వినియోగదారులు ఎక్కువే ఉండటంతో మరిన్ని ఫీచర్లతో వాట్సాప్ యూజర్లు ఆకట్టుకునేలా అప్డేట్ లు ఇస్తుంది. ఈసారి కూడా ఒక కొత్త అప్డేట్ ని తీసుకొచ్చింది వాట్సాప్..అదే ఛాటింగ్‌ చేసేప్పుడు ప్రతి ఛాట్‌ పేజ్‌కి కొత్త వాల్‌పేపర్‌ను సెట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇలా సెట్ చేసుకోవటానికి ప్రత్యేకంగా వాల్‌పేపర్‌ గ్యాలరీ అప్‌డేట్ చేయడంతో వ్యక్తిగత చాట్‌ల వాల్‌పేపర్‌లను సెట్ చేసుకోవాడం సులువే మరి.

ఒకవేళ మీరు కొత్త వాల్ వాల్‌పేపర్‌లను సెట్ చేసుకోవాలంటే ఇలా చేయండి.. ముందుగా మీ వాట్సాప్ ఓపెన్ చేసి, ఒక ఖాతాని సెలెక్ట్ చేసుకోండి. కుడివైపు కార్నర్ లో ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేసి వాల్ పేపర్ అని ఎంచుకోండి, అంతే అక్కడ బ్రైట్, డార్క్, సాలిడ్ కలర్స్, మై ఫొటోస్ అనే ఆప్షన్ కనిపిస్తాయి. ఇంకా మీకు నచ్చినది పెట్టుకోవచ్చు అది కూడా అన్ని కాంటాక్ట్స్ లేదా నచ్చిన ఖాతాకి సెట్ చేసుకోవచ్చు.

పర్సనల్ వాల్ పేపర్ తో పాటుగా, వినియోగదారులకు కాంతి(లైట్) మరియు డార్క్ థీమ్‌ల కోసం వేర్వేరు వాల్‌పేపర్‌లను సెట్ చేసుకునే వీలును కూడా ఈ అప్డేట్ కల్పిస్తుంది. డార్క్ థీమ్‌ల కోసం డిమ్మింగ్ ఆప్షన్ ఉండటం విశేషం.. దీని ద్వారా  వాల్ పేపర్ బ్రైట్ నెస్ తగ్గించుకోవచ్చు లేదా పెంచుకోవచ్చు. ఇది కేవలం డార్క్ థీమ్ వాళ్లకి మాత్రమే పని చేస్తుంది.. అందుకోసం మీరు వాట్సాప్ సెట్టింగ్ ఓపెన్ చేసి చాట్స్ అనే ఆప్షన్ ఎంచుకుని,  వాల్‌పేపర్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు వాల్‌పేపర్ డిమ్మింగ్ కనిపిస్తుంది. ఇంకా ఎంత బ్రైట్ నెస్ అవసరం అనేది సెట్ చేసుకోవటమే. ఈ కొత్త అప్డేట్ అన్ని మొబైల్స్ లో అందుబాటులో ఉంది కాబట్టి వెంటనే ట్రై చేయండి మరి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు