వినియోగదారులను ఆకర్షిస్తున్న వి(వోడాఫోన్-ఐడియా) కొత్త ప్లాన్

వి(వోడాఫోన్-ఐడియా) తొలిసారిగా వారి కలయిక తరువాత 1197 ప్రీపెయిడ్ ప్లాన్ అవైలబిలిటీను వ్యాప్తించింది

వి(వోడాఫోన్-ఐడియా)

మన బిజీ లైఫ్ లో ఫ్రెండ్స్, ఫామిలీ, రిలేటివ్స్ ని మిస్ అవుతూ ఉంటాం. వాళ్లలో ఎవరు గుర్తుకు వచ్చిన మనం చేసే మొదటి పని వారికి కాల్ చేయటం. ఎంత దూరం ఉన్న, ఒక కాల్ తో అందరిని దగ్గర చేస్తుంది, మనం ఎక్కువ సేపు మాట్లాడటానికి టెలికామ్ కంపెనీస్ కూడా డిఫరెంట్ ప్లాన్స్ ను తీసుకువస్తుంది.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, వి(వోడాఫోన్-ఐడియా) తొలిసారిగా వారి కలయిక తరువాత 1197 ప్రీపెయిడ్ ప్లాన్ అవైలబిలిటీను వ్యాప్తించింది. అసలు ఈ ప్లాన్ అంతకముందు ఎవరైతే స్మార్ట్‌ఫోన్ బండిల్‌ను కొంటారో, హోమ్ క్రెడిట్ ద్వారా లభించేది. హోమ్ క్రెడిట్ ఇండియా సంస్థతో, 2019 సంవత్సరములో వోడాఫోన్-ఐడియా పాట్నర్‌షిప్ కుదరించుకోగా, కొనుగోలుదారులు ఏదైనా 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.15వేల లోపు కొనాలని అనుకుంటే హోమ్ క్రెడిట్ సహాయంని కలిగిస్తుంది.

ఇపుడు 1197 ప్రీపెయిడ్ ప్లాన్, భారతదేశంలో అన్ని చోట్ల లభించడం విశేషం, మరిన్ని వివారాలు కోసం తమ వెబ్సైటు లో చూడొచ్చు అని తెలిపింది. ఒకవేల ఈ ప్లాన్ రీఛార్జి చేసుకోవాలంటే థర్డ్ పార్టీ పేమెంట్ యాప్ అయిన అమెజాన్ పే ద్వారా కూడా చేసుకోవచ్చు.

ఇక 1197 ప్రీపెయిడ్ ప్లాన్ మనకి ఎటువంటి సదుపాయాలని అందిస్తుంది అంటే అన్-లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజుకి 1.5జీబీ డేటా ఉంతుంది. వాలిడిటీ  విషయానికి వస్తే 180 డేస్ అని కంపెనీ తెలుపగా, రోజుకి 100 ఉచిత ఎస్సెమ్మెస్ లను అందిస్తుంది.

మూవీస్ & టీవీని ఉచితంగా కస్టమర్స్  వీక్షించవచ్చు, దీనితో పాటు ఒక వారంలో మిగిలిపోయిన డేటా ని నెక్స్ట్ వారంలో యూజ్ చేసుకునే సౌకర్యం ఉండటం మరో స్పెషలిటీ అనే చెప్పాలి. ఈ ప్లాన్ రాక ముందు డిఫరెంట్ ప్లాన్స్  రూ.599కు 1.5 జీబీ రోజువారీ డేటాను 84 రోజులు, రూ.2399 ప్రీపెయిడ్ ప్లాన్‌ను వాలిడిటీ  365 రోజులు అందించింది.  ఇంకో ప్రీపెయిడ్ ప్లాన్  ధర 2,595/- సంవత్సరం వాలిడిటీ తో 2జీబీ డేటా విత్ zee5 OTT  ప్లాట్‌ఫామ్‌ మెంబర్‌షిప్ ఉచితంగా వినియోగదారులు వాడుకోవచ్చు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు