‘వై-ఫై కాలింగ్’ సర్వీసెస్ ఇకపై అందిచనున్న వోడాఫోన్ ఐడియా

వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నతరుణంలో వై-ఫై కాలింగ్' లేదా 'వోవీ-ఫై' సేవను నేడు వోడాఫోన్ ఐడియా ప్రారంభించింది.

'వై-ఫై కాలింగ్' సర్వీసెస్ ఇకపై అందిచనున్న వోడాఫోన్ ఐడియా

టెలికాం సంస్థలు వినియోగదారులు అవసరాలు బట్టి రీఛార్జిలు, నెట్ వర్క్ వంటి వివిధ సేవలను అందిస్తుంది. తాజాగా ఇపుడు వైఫై కాలింగ్ సర్వీసును పలు టెలికాం కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇపుడు ఈ సేవలను వోడాఫోన్ ఐడియా ఇవాళ్టి నుండి ప్రారంభించింది. వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నతరుణంలో వై-ఫై కాలింగ్’ లేదా ‘వోవీ-ఫై’ సేవను నేడు తీసుకువచ్చింది.

ప్రస్తుతం వైఫై కాలింగ్ సేవలను కోలకతా, మహారాష్ట్ర, మరియు గోవా ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉంది. దశల వారీగా భారతదేశం అంతటా ఈ సేవను ప్రారంభించనున్నట్లు తెలిపింది.

ఏడాది క్రితమే వైఫై కాలింగ్ సేవలను జియో, భారతి ఎయిర్‌టెల్ కంపెనీలు ప్రారంభించాయి అని తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలో వోడాఫోన్ ఐడియా కలియక కుడా చేరడంతో “వి” కస్టమర్లు ఎప్పుడు ఉపయోగిస్తామా అని ఎదురుచూస్తున్నారు. కస్టమర్ సపోర్ట్ టీం, వోడాఫోన్ ఐడియా ట్విట్టర్ ఖాతా ఆధారంగా వై-ఫై కాలింగ్ ప్రారంభించినట్లు తెలిపింది. ఎయిర్టెల్ ప్రారంభించిన VoWi-Fi కాలింగ్ సేవల మాదిరిగానే ఈ సేవలు ఉండనున్నాయి అని టెలికాం నివేదిక ప్రకారం తెలుస్తుంది.

గత కొంతకాలంగా వై-ఫై కాలింగ్ సేవలను వోడాఫోన్ ఐడియా కంపెనీ ముందుగా టెస్ట్ చేసి, తరువాత అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు వైఫై కాలింగ్ సేవలను 2019లో ఇతర టెల్కోల కంటే ముందుగానే ప్రారంభిస్తున్నట్లు తెలిపింది కానీ వోడాఫోన్- ఐడియా యొక్క నెట్‌వర్క్ ఇంటిగ్రేషన్ కారణంగా లేట్ అయ్యింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు