ఝలక్ ఇచ్చిన వాట్సాప్: 2021లో కొత్త అప్డేట్

ఫిబ్రవరి 8న, 2021లో న్యూ టర్మ్స్ అండ్ కండీషన్స్

వాట్సాప్

స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదు.. అందులోనూ చాటింగ్ అప్లికేషన్స్ ద్వారా ఎక్కువ ఫ్రెండ్స్ తో టచ్లో ఉంటాము. ఏదైనా సడన్ గా అవసరం వచ్చినపుడు ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయకపోతే మనం చేసే మొదటి పని మెసేజ్ చేయటం. కేవలం మెసేజ్ మాత్రమేకాదు ఫోటోలు గాని, ఫేవరెట్ వీడియోలు గాని షేర్ చేయాలన మనకి ఈజీగా సెండ్ చేయాలంటే ఫస్ట్ గుర్తొచ్చేది వాట్సాప్. ఇది ఎప్పటికి అప్పుడు ఒక కొత్త అప్డేట్ ను తీసుకువచ్చి యూజర్లను సులువుగా యూస్ చేసుకునే విధంగా అందుబాటులో ఉంటుంది.

బట్ ఈసారి ఒక షాకింగ్ అప్డేట్ ను త్వరలో తీసుకురాబోతుంది. ఫిబ్రవరి 8న, 2021లో న్యూ టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ ని తీసుకువస్తునట్లు వెల్లడించింది. వాట్సప్ సంస్థ బ్లాగ్ ద్వారా ఈ  విషయాన్ని ప్రకటించింది.. ఇంకా వాట్సప్ వివినియోగదారులు ఈ కొత్త నిబంధనలను తమ మొబైల్స్ లలో పనిచేయదని తెలిపింది.

కొత్త నిబంధనలు గురించి  మరిన్ని పూర్తి వివరాలు స్క్రీన్ షాట్స్ రూపంలో వాబీటాఇన్‌ఫోలో షేర్ చేయగా, ఇందులో వాట్సాప్ కొత్త టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ ని అంగీకరించాలి లేదా మీ వాట్సప్ అకౌంట్ ను డిలీట్ చేస్కోండి అని స్క్రీన్ షాట్స్ లో ఉంది. అసలు వాట్సప్ టెస్ట్ దశలో ఉండగా తన ఫీచర్స్ ని తెలుపదు కానీ ఈసారి తీసుకురాబోయే టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను షేర్ చేసింది. ఈ అప్డేట్ వలన, యూజర్ డేటాను వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ ఎలా ఉపయోగిస్తుందనేది డీటైల్స్ తో వస్తుందని తెలియచేసింది.

దీనితో పాటు అన్ని సర్వీసెస్ కు ఫేస్ బుక్ చాటింగ్ ని బిజినెస్ కోసం ఎలా యూస్ అవుతుందో కూడా అందులో తెలిపింది. టర్మ్స్‌ అండ్‌ కండీషన్స్‌ను అంగీకరించని యూజర్ల వాట్సప్ అకౌంట్ డిలీట్ అవుతుందని స్క్రీన్ షాట్ లో తెలిపింది. ఎప్పుడు లేని ఈ కొత్త అప్డేట్ నిజంగానే వినియోగదారులకు పెద్ద ఝలక్ ఇచ్చింది అనే చెప్పాలి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు