అమెజాన్ లో డిస్కౌంట్ల జోరు

ప్రత్యేకంగా మొబైల్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక సేల్ ముందుకు తీసుకువస్తున్నట్లు ధృవికరించింది. దీనికి ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ అని పేరు కూడా పెట్టారు, డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు ఈ సేల్ కొనసాగుతుందని వివరించారు.

అమెజాన్ లో డిస్కౌంట్ల జోరు

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఎప్పటికప్పుడు సేల్స్ నిర్వహించి, భారత దేశంలో కస్టమర్లులను నుండి మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఈ దిగ్గజం కస్టమర్ల దృష్టి మేరకు ప్రత్యేకంగా మొబైల్ కొనుగోలుదారుల కోసం ప్రత్యేక సేల్ ముందుకు తీసుకువస్తున్నట్లు ధృవికరించింది. దీనికి ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్ అని పేరు కూడా పెట్టారు, డిసెంబర్ 22 నుండి డిసెంబర్ 25 వరకు ఈ సేల్ కొనసాగుతుందని వివరించారు. మొబైల్, మొబైల్ సంబంధిత ఇతర ఉపకరణాలపై డిస్కౌంట్, ఒప్పందాలను హైలైట్ చేయడానికి కంపెనీ సంబంధించి మైక్రో సైట్ రూపొందించింది.

అమెజాన్ తన మైక్రో సిటీలో ఈ నాలుగు రోజుల మొబైల్ సేల్స్ గురించి పూర్తి డీటెయిల్స్ మరియు విక్రయించే స్మార్ట్‌ఫోన్‌లను జాబితాను ఇందులో ఉంచింది. ఐఫోన్ 11, వన్‌ప్లస్ నార్డ్ 5జీ, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం51, రెడ్‌మీ నోట్ 9 ప్రో మాక్స్, రెడ్‌మీ 9 ప్రైమ్, వన్‌ప్లస్ 8 టీ 5జీ, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం31, శామ్‌సంగ్ గెలాక్సీ ఎం21 వంటి కంపెనీ మోడల్స్ తో పాటుగా మరెన్నో ఈ జాబితాలో ఉన్నాయి. వీటి తగ్గింపు ధర గురించి ఇందులో ఇంకా పేర్కొలేదు, డిసెంబర్ 19న అంటే ఈరోజు వెల్లడించే అవకాశం ఉంది.

పవర్ బ్యాంకులు, హెడ్‌ఫోన్లు, మొబైల్ కేసులు, కవర్లు, కేబుల్‌లతో సహా ఇతర మొబైల్ ఉపకరణాలపై కూడా ఫ్యాబ్ ఫోన్ ఫెస్టులో ఆఫర్లు లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ కంపెనీలు వన్‌ప్లస్, నోకియా, షియోమి, హానర్, శామ్‌సంగ్, ఎల్‌జి, రియల్‌మే, ఆపిల్, ఒప్పో, జాబ్రాతో సహా ఆఫర్స్ ఉంటాయని తెలిపింది.

ఇటువంటి భారీ మొబైల్ సేల్ కోసం ఇన్స్టాంట్ డిస్కౌంట్ కావాలంటే అమెజాన్ నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై 1,500 రూపాయల వరకు తగ్గింపు పొందవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ సదుపాయం ఉపయోగించుకుని మీకు నచ్చిన మొబైల్ దక్కించుకోండి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు