అమెజాన్ లో 7 రోజులు అమ్మకాలు నిలిపివేత

చిన్న, మధ్య తరహా వ్యాపారులకే లక్షల చొప్పున జరిమానా వేసే ప్రభుత్వాలు.. లక్షల కోట్ల వ్యాపారం చేసే అమెజాన్ కు మాత్రం 25 వేల రూపాయల జరిమానా విధించటం

Amazon 7Days Ban
Amazon 7Days Ban

అమెజాన్.. అడువులు అనే పదం పోయి.. ఇది ఆన్ లైన్ ఈ-కామర్స్ సైట్. అమెజాన్ లేకపోతే ఏమవుతుంది.. అమెజాన్ లో అమ్మకాలు నిలిపివేస్తే ఎలా ఉంటుంది.. అమెజాన్ మూసివేస్తే ఏం జరుగుతుంది.. కొన్ని రోజుల్లోనే అది దేశ ప్రజలకు తెలియబోతుంది. అవును.. అమెజాన్ సైట్ లో 7 రోజులు అమ్మకాలు బ్యాన్ చేయాలని CAIT (The Confederation of All India Traders) డిమాండ్ చేసింది.

దీనికి కారణం లేకపోలేదు. భారతదేశంలోని అమ్మకాలు జరిపే ప్రతి వస్తువుపై.. అది ఏ దేశంలో తయారు అయ్యింది అనేది స్పష్టం ముద్రించాలని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 30వ తేదీకి డెడ్ లైన్ పెట్టింది. భారతదేశ చట్టాలను ధిక్కరిస్తూ వస్తువులపై తయారీ దేశాలను ముద్రించకుండానే అమ్మకాలు చేస్తుంది. దీనిపై ఆల్ ఇండియా ట్రేడర్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. విచారణ చేసి.. నిజమే అని తేల్చారు. చట్టాలు ఉల్లంఘించినందుకు.. రూల్స్ ఫాలో కానందుకు 25 వేల రూపాయల ఫైన్.. అదేనండీ జరిమానా విధించింది కేంద్ర ప్రభుత్వం.

అమెజాన్ సంస్థకు విధించిన 25 వేల రూపాయల జరిమానా అంశం దేశంలోని వ్యాపారుల ఆగ్రహానికి కారణం అయ్యింది. చిన్న, మధ్య తరహా వ్యాపారులకే లక్షల చొప్పున జరిమానా వేసే ప్రభుత్వాలు.. లక్షల కోట్ల వ్యాపారం చేసే అమెజాన్ కు మాత్రం 25 వేల రూపాయల జరిమానా విధించటం ఏంటని నివ్వెరపోయారు.

కనీసం 7 రోజులు అమెజాన్ నుంచి అమ్మకాలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేసింది ఆల్ ఇండియా ట్రేడర్స్. రెండోసారి ఇదే పని చేస్తే 15 రోజులు బ్యాన్ చేయాలని డిమాండ్ చేశాయి. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశాయి. లోకల్.. స్థానిక వస్తువులను డిమాండ్ పెరగాలన్నా.. ఉత్పత్తిదారులకు ఉపాధి, ఉద్యోగాలు దొరకాలి అన్నా ఈ పని చేయాలని కేంద్రానికి డిమాండ్ చేశాయి.

ఇప్పటికిప్పుడు ఏడు రోజుల బ్యాన్ చేయాల్సిందే అని.. లేకపోతే ప్రజలే బహిష్కరిస్తారని హెచ్చరించారు CAIT జాతీయ అధ్యక్షుడు బీ.సీ. భార్టియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేవాలా.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు