ఇండియన్ టిక్ టాక్ జోష్ లో గూగుల్, మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు

gogle and microsoft investment in josh app

టిక్ టాక్ యాప్ బ్యాన్ అనంతరం , అదే రకమైన ఫీచర్లతో లాంచ్ అయిన జోష్ యాప్ మైక్రోసాఫ్ట్ , గూగుల్ సంస్థల నుండి దాదాపు 100 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సాధించింది. టిక్ టాక్ బ్యాన్ అనంతరం ఏర్పడిన గ్యాప్ ను గుర్తించిన వెర్స్ ఇన్ఫోటెక్ సంస్థ వారాల వ్యవధిలోని జోష్ అనే యాప్ ని అన్ని భారతీయ భాషల్లో లాంచ్ చేసింది.

సేమ్ టూ సేమ్ టిక్ టాక్ తరహా ఫీచర్లు ఈ యాప్ లో ఉండటంతో భారతీయ వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ యాప్ కు 77 మిలియన్ల యాక్టివ్ మంత్లీ యూజర్స్ అలాగే ప్రతి రోజు 1.5 బిలియన్ల వీడియో వ్యూస్ ఉన్నట్టు జోష్ యాప్ మాతృ సంస్థ వెర్స్ ఇన్ఫోటెక్ వెల్లడించింది.

టిక్ టాక్ బ్యాన్ అనంతరం సాధారణ వీడియో క్రియేటింగ్ యాప్ గా ప్రస్థానం మొదలుపెట్టిన్ జోష్ యాప్ అతి తక్కువ కాలంలోనే అనేక కొత్త ఫీచర్లు యాడ్ చేసుకుంటూ 16 భారతీయ భాషల్లో యూజర్లకు కావాల్సిన అన్ని రకాల ఫన్ ఫీచర్స్ ని అందించడంతో భారీ స్థాయిలో యాప్ ఇన్ స్టాలేషన్స్ సాధించింది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు