16 లక్షలు పెట్టి ఈ బండి కొనే ధైర్యం ఉందా ?

harley david son live wire bike

Harley-Davidson-Livewire : హార్లే డేవిడ్ సన్ బైక్స్ గురించి స్పెషల్ గా షో వేసి చెప్పాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఆ బైక్స్ కి ఉండే క్రేజ్, డేంజర్ అయినప్పటికి వంద నూటయాభై, రెండువందల స్పీడ్ లో ఆ బైక్స్ తోలుతుండే వచ్చే కిక్ వేరు. బ్రాంగ్ నేమ్ , హైయర్ సేఫ్టీ ఫీచర్స్( ఏమి ఉంటాయో ఎవరికి తెలియదు) ఉంటాయనే కారణంగా ఈ బైక్స్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బ్రాండ్ లో బేసిక్ బండి కొనాలన్నా తక్కువలో తక్కువ  పది లక్షలు పెట్టాల్సిందే. ఇక ఇంత కాలం పెట్రోల్ బైక్స్ అమ్ముకున్న ఈ బ్రాండ్ భవిష్యత్తులో కరెంట్ బైక్స్ హవా నడుస్తుందనే విషయాన్ని  గ్రహించి, లైవ్ వైర్ అనే పేరుతో బ్యాటరీ తో నడిచే బైక్స్ ని మార్కేట్లోకి లాంచ్ చేసింది.

ఒక్కో బైక్ ధర 16 లక్షల పైనే 

మా బైక్స్ అద్భుతమైన హార్డ్ వేర్ మరియు సాఫ్ట్ వేర్ ని ఉపయోగించుకోని నడుస్తున్నాయి. అద్భుతమైన టెక్నాలజీ మా సొంతం అని చెబుతున్న ఈ కంపెనీ, ఒక్కో బైక్ రేటును 22 వేల 999 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ లో 16 లక్షల 42 వేల చిల్లర గా ఫిక్స్ చేసింది. అద్భుతమైన హార్డ్ వేర్, సాఫ్ట్ వేరు అంటున్నాడు, అలాగే ఇంత రేటు ఉంది కాబట్టి దీన్ని ఒక్క సారి సారి ఛార్జ్ చేస్తే వెయ్యి కిలో మీటర్ల మైలేజ్ వస్తుందేమో, గంటకు రెండు మూడొందల కిలో మీటర్ల వేగంతో వెళ్తుందేమో అనుకుంటే మీరు మ్యాన్ హోల్ లో మునిగినట్టే. ఎందుకంటే ఈ బైక్ ను ఒక్క సారి ఛార్జ్ చేస్తే సిటీలో అయితే 250 కిలో మీటర్ల మైలేజ్ , హైవే పై అయితే 150 కిలో మీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుంది. ఒక వేళ స్పోర్ట్స్ మోడ్ లో నడిపితే 110 కిలో మీటర్ల మైలేజ్ మాత్రమే ఇస్తుంది.

ఇది వేరే వార్త : ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనండి.. రాయితీలు పొందండి అంటున్న గవర్నమెంట్

సరే మైలేజ్ సంగతి పక్కన పెడదాం.. ఛార్జింగ్ అయినా ఫాస్ట్ గా అవుతుందేమో అనుకుంటే అది కూడా దారుణంగా ఉంది. ఈ బైక్ ను 100% ఛార్జ్ చేయాలంటే కనీసం 11 గంటలు పడుతుంది. అంటే మనం ఒక రెండు గంటలు నాన్ స్టాప్ రైడ్ చేయాలంటే ఒక రాత్రి మొత్తం ఛార్జింగ్ పెట్టాలి. ఇక ఈ బైక్ విషయంలో మంచి ఏదన్నా ఉంది అంటే అది లుక్ మాత్రమే.

మైలేజ్ లేదు, ఫుల్ ఛార్జింగ్ పెట్టాలంటే 11 గంటలు వెయిట్ చేయాలి.. ఈ బైక్ కి ఇంత పెట్టడం అవసరమా అంటే.. ఎవరి ఇష్టం వారిది. అరే 16 లక్షలు పెట్టి బైక్ కొన్నాడు అని అనిపించుకోవాలి అనుకునే వారు కొనుక్కుంటారు. మనకి బైక్ చాలు అనుకునే వారు.. సేమ్ మైలేజ్, సేమ్ పికప్ ఇచ్చే అనేక బైక్స్ మార్కెట్ లో ఉన్నాయి కాబట్టి అవి కొనుక్కుంటారు. అయిన 16 లక్షలకు మంచి కార్ వస్తుంది.. ఇక అదే రేంజ్ లో ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి అనుకునే వారు కార్లు కొనుక్కుంటారు. ఎవరి ఇష్టం వారిది మధ్యలో మనం ఎవరు చెప్పడానికి.

 

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు