వాట్సాప్ నుండి బిగ్ అప్ డేట్ – ఇక నుండి మొబైల్లో సైతం లాగిన్, లాగౌట్

వాట్సాప్

వాట్సాప్.. నెట్ ఉంటే చాలు.. పని చేసేస్తుంది. ఇది చాలా మందికి ఇబ్బందిగా ఉంది. వాట్సాప్ మెసేజ్ లు అలా వచ్చి పడుతూనే ఉంటాయి. చూడకూడదు అనుకున్నా.. పదేపదే వచ్చే మెసేజ్ లతో చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు వినియోగదారులు. దీనిపై వాట్సాప్ కు ఎన్నో కంప్లయింట్స్ వెళ్లాయంట.

దీనిపై సుదీర్ఘంగా చర్చించిన వాట్సాప్.. 2021 అంటే ఈ సంవత్సరంలోనే.. జూన్ – జూలై నెలలో వాట్సాప్ లాగౌట్ ఆప్షన్ తీసుకురాబోతున్నది. అంటే గూగుల్, ఫేస్ బుక్ అకౌంట్ కు ఉన్నట్లే.. వాట్సాప్ లాగిన్ – లాగౌట్ ఉంటుంది. మీరు వాట్సాప్ క్లోజ్ చేయాలి అనుకుంటే.. దాంతో ఇబ్బందిగా ఉన్నది అనుకున్నప్పుడు చక్కగా లాగౌట్ చేసేస్తే.. ఎలాంటి మెసేజ్ లు రావు.. లాగిన్ కాగానే అన్నీ వచ్చేస్తాయి.

ప్రస్తుతం డెస్క్ టాప్ వెర్షన్ కు మాత్రమే స్కాన్ చేసి లాగిన్ – లాగౌట్ ఆప్షన్ ఉంది. మొబైల్ యూజర్లకు లేదు. ఇప్పుడు తీసుకొచ్చేది మొబైల్ వెర్షన్ లో.అంటే ఈ కొత్త ఫీచర్ తో మొబైల్ లో కూడా వాట్సాప్ ను లాగిన్ – లాగౌట్ చేసుకోవచ్చు. దీనిపై సీరియస్ గా దృష్టి పెట్టిన వాట్సాప్ మేనేజ్ మెంట్.. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని టెస్టింగ్ చేస్తుందంట. 2021లో వాట్సాప్ నుంచి వచ్చే బిగ్ అప్ డేట్ ఏదైనా ఉంది అంటే అది ఇదే అంటున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు