PubG రీ ఎంట్రీపై ట్రైలర్స్, టీజర్లు రిలీజ్

ఆఫిషియల్ ట్రైలర్ అఫ్ PUBG గేమ్ అంటూ కొంత మంది వీడియోస్ పెట్టారు. ఇదే నిజం

ఇప్పటి వరకు సినిమాలు, సీరియల్స్ మాత్రమే టీజర్లు, ట్రైలర్లు విడుదల చేస్తాం అనుకుంటాం.. ఫస్ట్ టైం ఓ వీడియో గేమ్ కు ట్రైలర్లు రిలీజ్ చేసి దుమ్ములేపారు నెటిజన్లు. ఆ గేమ్ ఏంటో తెలుసా పబ్ జీ. అవును.. మళ్లీ ఇండియాలోకి వస్తుంది అనే వార్తతో సోషల్ మీడియాలో పబ్ జీ రీ ఎంట్రీ అంటూ ట్రైలర్లు, టీజర్లతో హల్ చల్ చేశారు నెటిజన్లు.

పబ్ జీ గేమ్ వల్ల భారతదేశంలోని సమాచారాన్ని చైనా దొంగతనం చేస్తుంది అంటూ ప్రభుత్వం బ్యాన్ చేయటంతో.. ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఎంతో మంది పిచ్చోళ్లు అయ్యారు. అలాంటి వారు అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. పబ్ జీ వస్తోంది అంటూ గంతులు వేస్తున్నారు. సరికొత్తగా PUBG మళ్లీ తిరిగి.. కొత్త వెర్షన్ లో రీ ఎంట్రీ ఇస్తుంది అనేది వారి ఆశ.

ఇదే ఆఫిషియల్ ట్రైలర్ అఫ్ PUBG గేమ్ అంటూ కొంత మంది వీడియోస్ పెట్టారు. ఇదే నిజం అనుకుని అందరూ దాన్ని ఫాలో అయ్యారు. మరికొందరు పబ్ జీ మొబైల్ ఇండియా ఛానల్ అంటూ ఓ ఐడీ క్రియేట్ చేసి వదిలేశారు. ఒకటి తర్వాత ఒకటి.. వందల సంఖ్యలో ఫొటోలు, వీడియోలు ఒక్క రోజులోనే పుట్టుకొచ్చాయి. దేశవ్యాప్తంగా కుర్రకారు పోటీపడి మరీ ఆల్ ద బెస్ట్, పబ్ జీ రీ ఎంట్రీ అంటూ కామెంట్లు కురిపించేశారు.

తీరా చివరికి తెలిసింది ఏంటీ అంటే.. ఇదంతా ఫేక్ అని.. పబ్ జీ అభిమానులు చేసిన ఫేక్ వీడియోలు అని.. దీంతో నెటిజన్లు, పబ్ జీ ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఇప్పటి వరకు పబ్ జీ రీ ఎంట్రీ ఏ కంపెనీ కానీ, ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.. ఇప్పట్లో వచ్చే పరిస్థితి కూడా లేదు. రావొచ్చు.. దానికి ఇంకా చాలా టైం ఉండొచ్చు అంటున్నారు ఐటీ నిపుణులు. అప్పటి వరకు ఇలాంటి ఫేక్ న్యూస్ తో సంభ్రమాశ్చర్యంతో ఆనందం పడటమే…

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు