పోవా కొత్త మొబైల్ – బెస్ట్ గేమింగ్ ఫోన్

పోవా కొత్త మొబైల్ - బెస్ట్ గేమింగ్ ఫోన్.. టెక్నో కంపెనీ వారి ఇదే ఫస్ట్ గేమింగ్ ఫోన్ కావటం విశేషం. మిడ్ రేంజ్ స్మార్ట్ మొబైల్స్ లో బెస్ట్ అంటోంది టెక్నో కంపెనీ.

Tecno Pova With MediaTek Helio G80 SoC to Launch in India
Tecno Pova With MediaTek Helio G80 SoC to Launch in India

ఏదైనా పండగ వచ్చిందంటే ఏదో ఒక వస్తువు కొనడం కామన్.. ఇప్పుడు ఆలా కాదు, స్మార్ట్ ఫోన్ వచ్చాక మనం రెగ్యులర్ గా చాలా మొబైల్స్ మారుస్తూ ఉంటాం. ఎందుకంటే మొబైల్ ఫోన్ అనేది మనల్ని ఎప్పుడు వెంటాడే ఎమోషన్, మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం చూసేదే మొబైల్. దీనికి కారణం, ఎప్పటికప్పుడు కొత్త డిజైన్, కొత్త ఫీచర్ అండ్ మోడల్ తో కంపెనీలు అట్ట్రాక్ట్ చేస్తూ మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు.

వారం రోజుల్లో ఇండియాలోకి టెక్నో సంస్థ పోవా పేరుతో కొత్త మొబైల్ లాంచ్ చేస్తుంది. టెక్నో కంపెనీ వారి ఇదే ఫస్ట్ గేమింగ్ ఫోన్ కావటం విశేషం. మిడ్ రేంజ్ స్మార్ట్ మొబైల్స్ లో బెస్ట్ అంటోంది టెక్నో కంపెనీ. ఆల్రెడీ నైజీరియా, ఫిలిప్పీన్స్తో సహా కొన్ని దేశాల్లో విడుదల చేయగా, ఇండియాలో డిసెంబర్ 4న ఈ -కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో పోవా త్రి కలర్స్ మ్యాజిక్ బ్లూ, స్పీడ్ పర్పుల్, డాజిల్ బ్లాక్ లో లభిస్తుంది.

పోవా ప్రత్యేకతలు చూస్తే.. పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, క్వాడ్ రియర్ కెమెరా సెటప్.. స్క్రీన్ రిజల్యూషన్ 720×1640 పిక్సెల్స్ ఉంది. ఆక్టా-కోర్ మీడియా టెక్ హెలియో జీ80 ప్రాసెసర్ ని బేస్ చేసుకుని వర్క్ చేస్తుంది. మరిన్ని పోవా ఫీచర్స్ గురించి చెప్పాలంటే 6.7 అంగుళాల హెచ్డీ+ డాట్-ఇన్ డిస్ ప్లే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ విత్ ఏఐ లెన్స్ ఇందులో ఉండనున్నాయి.

ఈ మొబైల్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ అండ్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేయనుంది. ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ వంటి కామన్ ఫీచర్స్ ఉన్నాయి. దీని ధర స్టార్టింగ్ 10 వేల 800 రూపాయల నుంచి ఉండబోతున్నది.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు