కోలుకుంటున్న తెలంగాణ భారీగా తగ్గిన కరోనా కేసులు

కోలుకుంటున్న తెలంగాణ భారీగా తగ్గిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత రెండు రోజులుగా 1000 తక్కువ కరోనా కేసులు నమోదవుతుండటం సంతోషించాల్సిన విషయం. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 582 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఏడు జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడవం గమనార్హం. ఇక టెస్టుల సంఖ్య కూడా అమాంతం తగ్గింది.

పరీక్షల సంఖ్య తగ్గడంతోనే కేసులు కూడా తగ్గాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. కొద్దిరోజులుగా వర్షాలు, దానికి తోడు పండుగ ఉండటంతో ప్రజలు టెస్టులు చేయించుకునేందుకు ఆసక్తి కనబరచడం లేదని అర్ధమవుతుంది. ఇక కరోనా కేసులు నమోదు కానీ జిల్లాలు జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమరం భీమ్ ఆసిఫాబాద్, ములుగు, నారాయణపేట్, నిర్మల్, పెద్దపల్లి. గ్రేటర్ పరిధిలో కూడా కేసుల సంఖ్య చాలా తక్కువ నమోదైంది.

ఆదివారం కేవలం 174 మంది మాత్రమే కరోనా బారిన పడ్డట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో 87, రంగారెడ్డి జిల్లాలో 55, మేడ్చల్ జిల్లాలో 38, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 కేలులు నమోదయ్యాయి. మిగిలిన జిల్లాల్లో ఆదిలాబాద్ 9, జగిత్యాల్‌ 14, జనగాం 2, జోగులమ్మ గద్వాల్‌ 4, కరీంనగర్‌ 15, ఖమ్మం 17, మహబూబ్‌ నగర్‌ 15, మహబూబాబాద్‌ 13,

మంచిర్యాల్‌ 2, మెదక్‌ 4, నాగర్‌ కర్నూల్‌ 6, నల్గొండ 87, నిజామాబాద్‌ 24, రాజన్న సిరిసిల్ల 4, సంగారెడ్డి 31, సిద్ధిపేట్‌ 15, సూర్యాపేట 4, వికారాబాద్‌ 4, వరంగల్‌ రూరల్‌ 7, వరంగల్‌ అర్బన్‌ 13, యాద్రాది భువనగిరి 2 వనపర్తిలో 1 కేసులు నమోదయ్యాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి