వెంటిలేటర్ పై నాయిని నరసింహారెడ్డి – విషమంగా ఆరోగ్యం

nayni narasimha reddy health in serious condition

తెలంగాణ రాష్ట్ర మాజీ హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సన్నిహితుల నుండి సమాచారం అందింది.జూబ్లీ హిల్స్ లోని అపోలో హాస్పటల్లో క్రిటికల్ కేర్ యూనిట్ లో వెంటిలేటర్ పై నాయిని నరసింహారెడ్డి ఉన్నట్టు తెలిసింది.

గత నెల 28 న  కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ 16 రోజుల పాటు చికిత్స్ తీసుకున్నారు. చికిత్స అనంతరం కరోనా నెగటివ్ రావడంతో ఆయన పూర్తిగా కోలుకున్నట్టు అందరు భావించారు.

అయితే ఊహించని రీతిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో పాటు, న్యూమోనియా భారిన పడటంతో శరీరంలోని ఆక్సిజన్ నిల్వలు ఒక్కసారిగా పడిపోయాయి. ప్రస్తుతం అపోలో హాస్పటల్లో అనేక మంది వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఉన్నారు. ప్రముఖ డాక్టర్లైన సునీతా రెడ్డి, డాక్టర్ రవి ఆండ్రూస్, డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి లు నాయిని ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

నాయిని భార్య అహల్య కరోనా భారిన పడి బంజారా హిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ లో చికిత్స తీసుకుంటుంది. ఇక నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి, అతని పెద్ద కుమారుడు సైతం కరోనా భారిన పడి పూర్తిగా కోలుకున్నారు.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు