ఆ ఐదు యూనివర్సిటీలలో రిజర్వేషన్లు లేవు.. ఫీజు రియంబర్స్ మెంట్ కూడా లేదు

తెలంగాణలో ఐదు ప్రవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు వర్తించవని, ఫీజు రీయంబర్స్మెంట్ కూడా రాదని విద్యాశాఖామంత్రి సబితా ఇంద్ర రెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీలో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యా ప్రమాణాలను పెంచడమే తమ లక్ష్యమని, అందుకోసం అనేక చర్యలను తీసుకుంటున్నామని ఆమె స్పష్టం చేశారు.

కాగా రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలలొ నాణ్యత పెంచేందుకు 350 కాలేజీల నుంచి 180 కి తగ్గించినట్లు ఆమె తెలిపారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు 2018 లోనే చట్టం తెచ్చామని అన్నారు. అయితే ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటు చెయ్యడానికి 16 సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే తొలిదశలో ఐదు యూనివర్సిటీలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అందులో మహీంద్రా, హూస్టన్, మల్లారెడ్డి, అనురాగ్, ఎస్ఆర్ వర్సిటీలు ఉన్నట్లు తెలిపారు. కాగా ఈ విద్యా సంవత్సరం నుంచి వీటిలో నూతన నిబంధనలు అమలు కానున్నాయి.

మీ అభిప్రాయం కామెంట్ చేయండి