ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఐటీ కంపెనీలు – వర్క్ చేయాలని టార్చర్ – నెట్ వర్క్ లేక లబోదిబో

ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోని ఐటీ కంపెనీలు – వర్క్ చేయాలని టార్చర్ – నెట్ వర్క్ లేక లబోదిబో

హైదరాబాద్ వరద బీభత్సానికి సిటీలోని 80 శాతం మంది ఎఫెక్ట్ అయ్యారు. సిటీ మొత్తం అంథకారం. ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయి. సెల్లార్లు మునిగిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. కరెంట్ కట్ అయ్యింది. ఇంటర్నెట్ నెట్ వర్క్ డౌన్ అయ్యింది. ఈ సమస్యల క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. అక్టోబర్ 14, 15 తేదీలు.. రెండు రోజులు హైదరాబాద్ అంతా సెలవు ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను ఐటీ కంపెనీలు అస్సలు పట్టించుకోలేదు.

ఇంటి నుంచే కదా వర్క్ చేయమని టార్చర్ పెట్టారు. దీంతో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఇంట్లో కరెంట్ లేదు.. బ్యాకప్ డెడ్ అయ్యింది.. మరో వైపు నెట్ వర్క్ డౌన్.. ఏం చేయాలో అర్థం కాక.. ఆ ప్రస్టేషన్ అంతా ఇంటర్నటె ప్రొవైడర్స్ పై చూపించారు. నెట్ ఇవ్వండి అంటూ ప్రొవైడర్లతో గొడవలకు దిగారు. చెట్లు విరిగిపడ్డాయి కరెంట్ లేదు.. లైన్లు డౌన్ అయ్యాయి అని చెప్పినా వినిపించుకోలేదు.

మా బాధలు మాకున్నాయి.. కంపెనీలు వర్క్ చేయమంటున్నారు అంటూ లబోదిబో అన్నారు. ప్రభుత్వం రెండు రోజులు సెలవు ఇచ్చింది కదా ప్రాబ్లమ్ ఏంటీ.. ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు అని చెప్పినా వినిపించుకోలేదు ఐటీ ఉద్యోగులు. ఇంట్లోనే ఉన్నారు కదా లాగిన్ అవ్వమని పదేపదే మేనేజర్లు ఒత్తిడి చేశారు. చాలా మంది ఐటీ ఉద్యోగులు ఈ సమస్యను తీవ్రంగా ఎదుర్కొన్నారు.

మరో వైపు ఇంటర్నట్ సర్వీస్ ప్రొవైడర్లు సైతం మానసిక ఆందోళనకు గురయ్యారు. వందల కొద్ది కనెక్షన్స్ దెబ్బతిన్నాయి. అన్నీ ఒకేసారి చేయటం సాధ్యం కాదు. కొన్ని చోట్ల చెట్లు, కరెంట్ స్థంభాలు విరిగి పడ్డాయి. ఇవన్నీ తొలగించాల్సింది జీహెచ్ఎంసీ. వాళ్లూ బిజీగానే ఉన్నారు. ఆ తర్వాత కరెంటోళ్లు.. వాళ్లు కూడా లెక్కలేనన్ని కాల్స్ తో బిజీ.. మరోవైపు ఇంటర్నెట్ ప్రొవైడర్లు వాళ్ల శక్తికి మించి పని చేస్తున్నారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా ఐటీ ఉద్యోగులు సెలవు ఇవ్వేలేదు. పని చేయమని చెప్పటం.. చేయకపోతే ఉద్యోగం పోతుందనే ఆందోళనతో.. ఆ ప్రస్టేషన్ ఇంటర్నట్ సర్వీస్ ప్రొవైడర్లపై చూపించారు.

యాక్ట్ అయినా.. హాత్ వే అయినా.. జియో అయినా.. ఎయిర్ టెల్ అయినా.. సర్వీస్ ఏదైనా సిటీలో సగం మందికి ఇప్పటికీ కరెంట్, ఇంటర్నెట్ అందుబాటులో లేదు. హైదరాబాద్ సిటీ విధ్వంసాన్ని పట్టించుకోకుండా.. కనీసం సానుభూతి లేకుండా ఐటీ కంపెనీలు వ్యవహరించిన తీరు వారి అరాచకానికి పరాకాష్ఠగా మారింది.
ఐటీ శాఖ మంత్రి అయిన కేటీఆర్ గారు.. ఓసారి ఈ ఐటీ కంపెనీల తీరును కూడా పట్టించుకోండి..

మీ అభిప్రాయం కామెంట్ చేయండి

మా వార్తలు చదివినందుకు ధన్యావాదాలు